Namitha Weight Loss : బరువుపై వచ్చిన కామెంట్స్ తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అందాల బొమ్మ నమిత

టాలీవుడ్ లో సొంతం సినిమాతో భైరవిగా అడుగు పెట్టిన నమిత కోలీవుడ్ లో స్టార్  హీరోయిన్  గా పేరు తెచ్చుకుని.. దేవతగా పూజలందుకుంది. జెమిని సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది. ఆ సినిమాలో నిజంగా అందాల..

Namitha Weight Loss : బరువుపై వచ్చిన కామెంట్స్ తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అందాల బొమ్మ నమిత

Updated on: Feb 04, 2021 | 11:54 AM

Namitha Weight Loss : టాలీవుడ్ లో సొంతం సినిమాతో భైరవిగా అడుగు పెట్టిన నమిత కోలీవుడ్ లో స్టార్  హీరోయిన్  గా పేరు తెచ్చుకుని.. దేవతగా పూజలందుకుంది. జెమిని సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది. ఆ సినిమాలో నిజంగా అందాల బొమ్మలా ఉంది నమిత. కెరీర్‌లో ఆరంభంలో సన్నగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బిల్లా, సింహా సినిమాల్లో బొద్దుగా కనిపించి అందర్నీ షాక్‌కు గురి చేసింది. అయితే కోలీవుడ్ లో ముద్దుగుమ్మలకు పట్టంగడతారు.. తమిళులు ఏకంగా ఈ భామకు గుడి కట్టేశారు కూడా.. అయితే బొద్దు గుమ్మ నుంచి ఆమ్మో ఇంట లావా అనే స్టేజ్ కు వెల్లింపోయింది. అందరికీ షాక్ ఇచ్చింది. అయితే తాజాగా ఇదే విషయంపై నమిత తన సోషల్ మీడియా వేడికాగా స్పందించింది..

నమిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సుమారు తొమ్మిది, పదేళ్ల క్రితం తాను బొద్దుగా ఉండేదాన్నని, అప్పట్లో ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యానని చెప్పింది. ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నాననే విషయం కూడా తనకు తెలియకపోవడం చాలా బాధాకరమని వెల్లడించింది. రాత్రిపూట నిద్రపోయేదాన్ని కాదని. ఆహారం ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మారిందని, అందుకే తన బరువు 97 కిలోలకు చేరిందని చెప్పింది. కానీ కొంతమంది మద్యం తాగడం వల్లే బరువు పెరిగానని చెప్పుకున్నారు. అసలు విషయం తనకు మాత్రమే తెలుసని చెప్పుకొచ్చింది.

థైరాయిడ్‌, పీసీఓడీ సమస్యల వల్లే తాను లావుగా మారానని తెలిపింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు తనను మరెంతో బాధించాయని పేర్కొంది. దాదాపు ఐదేళ్లపాటు తీవ్రమైన కుంగుబాటు ఎదుర్కొన్న తర్వాత యోగాతో మనశ్శాంతి లభించిందని ప్రకటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నమిత మళ్ళీ ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీకి రెడీ అవుతుంది.

Also Read:

 ఊరు, పేరు లేని సినిమా మరెవరిదో కాదు… అసలు విషయాన్ని వెల్లడించిన చిత్ర యూనిట్.

నువ్వు లేకపోతే నేను లేనంటోన్న ‘బొమ్మరిల్లు హాసిని’… పెళ్లి రోజున ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన బ్యూటీ..

Loading...
Unable to load recommendations.
Follow Us