Bigg Boss-4 : మిగతా కంటెస్టెంట్‌లో లేనిది అభిజిత్‌లో ఉన్నది ఏంటి? అసలు బిగ్‌బాస్-4 విజేతగా ఎలా నిలిచాడంటే..

|

Dec 21, 2020 | 1:35 AM

అభిజిత్ ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగుతుంది. మా టీవీ వారు నిర్వహిస్తున్న క్రేజీ స్టేజీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 విజేతగా

Bigg Boss-4 : మిగతా కంటెస్టెంట్‌లో లేనిది అభిజిత్‌లో ఉన్నది ఏంటి? అసలు బిగ్‌బాస్-4 విజేతగా ఎలా నిలిచాడంటే..
Follow us on

Bigg Boss-4 :  అభిజిత్ ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారు మోగుతుంది. మా టీవీ వారు నిర్వహిస్తున్న క్రేజీ స్టేజీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 విజేతగా నిలిచి అందరికి సుపరిచితుడయ్యాడు. పోటీలో నిలిచిన కంటెస్టెంట్లందరిని వెనక్కి నెట్టి విన్నర్‌గా నిలిచాడు. టాలీవుడ్ టాప్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ట్రోపిని అందుకున్నాడు.

బయటపడలేదు కానీ అభిజిత్ బిగ్‌బాస్ గెలవడానికి చాలా ఓర్పుతో, సహనంతో, నేర్పరితో టాస్క్‌లు ఆడాడు. మిగిలిన కంటెస్టెంట్లతో పోల్చుకుంటే భిన్నంగా వ్యవహరించాడు. బిగ్‌బాస్ హౌజ్‌లో అందరు కొన్నిరోజులకే తన నిజమైన వ్యక్తిత్వాలను బయటపెట్టగా అభిజిత్ మాత్రం చాలా జాగ్రత్తగా కూల్‌గా, గాబరాపడుకుండా మెలిగాడు. ఎదుటివారు ఆవేశంతో నిప్పులు చెరుగుతున్నా అత‌డు మాత్రం త‌న స‌హ‌నం కోల్పోయేవాడు కాదు. ప‌రిస్థితికి తగ్గట్టుగా మెదిలేవాడు. అలా ప్రేక్షకుల మనుసును గెలుచుకోవడంతో సఫలీకృతుడయ్యాడు. అత్యధిక ఓట్లు గెలుచుకొని విజేతగా నిలిచాడు. దీంతో అతడి అభిమానులందరు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు.