ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. దేశంలోనే కాదు.. ఈ ముద్దుగుమ్మకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిచర్డ్ మ్యాడెన్, ప్రియాంక ప్రధాన పాత్రలలో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా ఏప్రిల్ 28 నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో ప్రస్తుతం 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్ అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2023లో తన భర్త నిక్ జోనాస్ తో సందడి చేసింది ప్రియాంక. కేవలం హాలీవుడ్ సెలబ్రెటీస్ మాత్రమే కాదు.. బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ వేడుకలో మెరిసారు. అయితే ఈ వేదికపై తన భర్త్ నిక్ జోనాస్ తో ప్రియాంక మరింత అందంగా కనిపించారు. ముఖ్యంగా ఇందులో ప్రియాంక స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్ హాట్ టాపిక్ అయ్యింది.
మెట్ గాలా 2023 ఈవెంట్లో ప్రియాంక 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ ధరించింది. ఈ నగ బల్గారీ బ్రాండ్ కు చెందినది. అమెరికన్ మనీ ప్రకారం ఈ నెక్లెస్ ధర 25 మిలియన్ డాలర్స్. అంటే దాదాపు రూ. 204 కోట్లు. దీనిని డ్రామటిక్ ట్రలయ్ అలాగే మెట్ గాలా ఈవెంట్ తర్వాత నెక్లెస్ ను వేలం వేయనున్నట్లు సమాచారం.
ఈ వేడుకలో ప్రియాంక, నిక్ ఇద్దరూ బ్లాక్ స్టైలీష్ కాస్ట్యూమ్స్ లో మరింత అందంగా మెరిశారు. అంతేకాదు.. వేదికపైకి వెళ్లేముందు తన భార్య చేతిని పట్టుకుని తనకు సాయం చేశారు నిక్. తమ ప్రేమకథకు మెట్ గాలా ఈవెంట్ ప్రారంభవేదిక అని.. 5-6 సంవత్సరాల క్రితం ఇదే వేదికపై తాము స్నేహితులమంటూ మరోసారి తన ప్రేమను గుర్తుచేసుకున్నారు నిక్.
This one is cute ?♥️ #NickJonas #PriyankaChopra #MetGala2023 pic.twitter.com/SBKat679Wa
— NP LEGΛCY ?? | Loving MMCJ ❤? (@np_legacy) May 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.