బ్రూస్ లీ కే సాధ్యమైన వన్ ఇంచ్ పంచ్ టెక్నీక్‌తో ఓ యువకుడి వీడియో.. బ్రుస్ లీ మళ్ళీ పుట్టాడంటూ నెటిజన్లు ఫిదా

|

Apr 08, 2021 | 6:26 PM

Bruce Lee Reborn: కరాటే యోధుడు, మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ నటుడు బ్రూస్ లీ మళ్ళీ పుట్టాడని అంటున్నారు.. ఓ యువకుడి నైపుణ్యం చూసి.. తాజాగా ఓ చైనీస్ మార్షల్ ఆర్టిస్ట్..

బ్రూస్ లీ కే సాధ్యమైన వన్ ఇంచ్ పంచ్ టెక్నీక్‌తో ఓ యువకుడి వీడియో.. బ్రుస్ లీ మళ్ళీ పుట్టాడంటూ నెటిజన్లు ఫిదా
Bruce Lee Reborn
Follow us on

Bruce Lee Reborn: కరాటే యోధుడు, మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ నటుడు బ్రూస్ లీ మళ్ళీ పుట్టాడని అంటున్నారు.. ఓ యువకుడి నైపుణ్యం చూసి.. తాజాగా ఓ చైనీస్ మార్షల్ ఆర్టిస్ట్ తన అద్భుతమైన ఒన్ ఇంచ్ పంచ్ నైపుణ్యంతో నెటిజన్లు ను షాక్ కు గురిచేశారు. ఈ యువ మార్షల్ ఆర్టిస్ట్ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని మిక్సియన్ జిల్లాకు చెందినవాడు. నిజానికి ఈ వన్ ఇంచ్ పంచ్ అనేది కుంగ్ పూ లోని ఓ కళ.. దీనికి అత్యంత ప్రాచుర్యం తెచ్చిన వారు అలనాటి మేటి హాంకాంగ్ మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్ లీ.  ఈ వన్ ఇంచ్ పంచ్ ఇప్పటికీ దక్షిణ చైనీస్ యుద్ధ కళలో ఒకటిగా ఉంది. అంతేకాదు ఇది ఫా జిన్ అని పిలువబడే ఒక యుద్ధ నైపుణ్యం.

ఇది 1960లో బ్రూస్ లీ ద్వారా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. 1964 లో లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ప్రదర్శన తర్వాత బ్రుస్ లీ వన్ ఇంచ్ పంచ్ తో ప్రపంచ ఖ్యాతి తో పాటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హాంగ్ కాంగ్‌లోని వింగ్ చున్ శిక్షణ తరగతుల్లో బ్రుస్ లీ ఈ కళను అభ్యసించినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ హాంకాంగ్, చైనా వంటి దేశాల్లో మార్షల్ ఆర్ట్స్ అన్ని వర్గాల ఆదరణ సొంతం చేసుకున్నప్పటికీ ఈ వన్ ఇంచ్ పంచ్ మాత్రం బ్రుస్ లీ మరణం తర్వాత ప్రజాదరణ కోల్పోయింది. బ్రుస్ లీ సినిమాలు చూసే సమయంలో ఈ టెక్నీక్ ను యువత ఇష్టపడతారు. ఐతే ఇప్పుడు ఒక చైనీస్ మార్షల్ ఆర్టిస్ట్.. బ్రుస్ లీ ఒకప్పుడు చేసిన వన్ ఇంచ్ పంచ్ ను చేసి చూపించాడు. మార్షల్ ఆర్టిస్ట్ ఈ పంచ్ ను ప్రదర్శించే వైరల్ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో లో ఒక యువకుడు తన వన్ ఇంచ్ పంచ్‌తో రెండు సిమెంట్ బ్లాక్‌లను పగలగొట్టేటప్పుడు స్త్రీని తన కుడి భుజంపై మోసుకెళ్ళడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తుంది. చిన్న వయసులోనే అనుమాస్పద స్థితిలో మృతి చెందిన బ్రుస్ లీ ని గుర్తు చేసుకుంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ప్రముఖ పుణ్యక్షేత్రం హ‌నుమంతుని జ‌న్మస్థానం.. ఆధారాలతో సహా నిరూపిస్తామంటున్న టీటీడీ .. ఎప్పుడంటే..!

ఉగాది పండుగకి అల్లుడైన వెంకన్నని ఇంటికి రమ్మని పిలిచే ముస్లిం భక్తులు..