మహేష్‌తో ప్రామిస్ తీసుకున్న ఆ హీరోయిన్ ఇప్పుడు ‘నో’ చెప్పిందా..!

ఈ ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు'తో  ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో

మహేష్‌తో ప్రామిస్ తీసుకున్న ఆ హీరోయిన్ ఇప్పుడు నో చెప్పిందా..!

Updated on: May 30, 2020 | 10:15 AM

ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’తో  ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్దమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో టాక్‌ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. అందులో కియారా అద్వానీ కూడా ఒకటి.

మహేష్‌ నటించిన ‘భరత్ అనే నేను’ మూవీ ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయిన కియారా, ఆ మూవీ తరువాత రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’లో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ కావడం, బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు రావడంతో ఇప్పుడు ఈ బ్యూటీ అక్కడే తిష్టేసింది. అయితే ‘భరత్ అనే నేను’ ఆడియో ఫంక్షన్‌లో తనకు మరో అవకాశం ఇవ్వాలని మహేష్ దగ్గర ఈ హీరోయిన్‌ ప్రామిస్ తీసుకుంది. దానికి సూపర్‌స్టార్ కూడా ఓకే చెప్పారు. ఈ క్రమంలో పరశురామ్ తన చిత్రం కోసం కియారాను సంప్రదించారట. అయితే కారణాలు తెలీవు గానీ, ఇందులో నటించేందుకు ఆమె అంత ఆసక్తిని చూపడం లేనట్లు తెలుస్తోంది. కథను విన్నప్పటికీ, కియారా మేకర్స్‌కి ఏం చెప్పలేదట. దీంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం మూవీ యూనిట్ వెతుకులాట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? మహేష్‌తో జత కట్టబోయే హీరోయిన్ ఎవరు..? ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లబోతుంది..? తదితర ప్రశ్నలకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read This Story Also: 1 year for Jagan Ane Nenu: జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలివే..!

Loading...
Unable to load recommendations.
Follow Us