అన్నయ్యతోనే కాదు తమ్ముడితో మరోసారి..!

పవన్‌ కల్యాణ్ ప్రస్తుతం మూడు చిత్రాలకు ఓకే చెప్పారు. అందులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ, హరీష్‌ శంకర్ దర్శకత్వంలో మరొకటి.

అన్నయ్యతోనే కాదు తమ్ముడితో మరోసారి..!

Updated on: Apr 11, 2020 | 9:08 AM

పవన్‌ కల్యాణ్ ప్రస్తుతం మూడు చిత్రాలకు ఓకే చెప్పారు. అందులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ, హరీష్‌ శంకర్ దర్శకత్వంలో మరొకటి. వీటిలో వకీల్ సాబ్, క్రిష్ మూవీల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఇక వకీల్‌ సాబ్‌లో పవన్ సరసన శ్రుతీ హాసన్ మూడోసారి జతకట్టబోతుండగా.. క్రిష్‌ మూవీలో హీరోయిన్‌పై అధికారిక ప్రకటన రాలేదు. ఇక హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా తనకు అచ్చొచ్చిన పూజా హెగ్డేకు హరీష్‌ ఆఫర్ ఇచ్చినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకోవాలని దర్శకుడు హరీష్‌ శంకర్‌ భావిస్తున్నారట. దీనికి సంబంధించి ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పవన్‌తో రెండోసారి జత కట్టబోతోంది కాజల్. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు టాక్. కాగా ఆచార్య సినిమాలో చిరు సరసన కాజల్ రెండోసారి రొమాన్స్‌ చేయబోతోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: ‘ఆర్ఆర్ఆర్‌’పై కీలక నిర్ణయం తీసుకున్న జక్కన్న..!

Loading...
Unable to load recommendations.
Follow Us