ఒకవైపు మాస్ మహారాజా నటించిన క్రాక్ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. న్యూఇయర్ కానుకగా క్రాక్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా తను నటిస్తున్న న్యూమూవీ ‘ఖిలాడీ’కి సంబంధించిన పోస్టర్ రివీల్ చేసి ఫ్యాన్‌ను సర్ఫ్రైజ్ చేశాడు ఈ మాస్ మహారాజా. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ గురించి రవితేజ ముందుగానే హింట్ ఇచ్చాడు. 2021 జనవరి 1న ఉదయం 9 గంటలకు సర్ ఫ్రైజ్ ఉంటుందని చెప్పాడు. ఇక న్యూఇయర్ కానుకగా ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం.
ఇందులో రవితేజ రెండు గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. కళ్ళజోడు పెట్టుకొని భయపడుతూ ఒక గెటప్‌లో కనిపించగా.. చేతిలో గన్ పట్టుకొని మరో గెటప్‌లో కనిపించాడు. ఇందులో రవితేజ డబలు యాక్షన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. డా.జయంతి లాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై కోనేరు సత్యనారాయణ ఖిలాడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజకు జోడిగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పంధన వచ్చింది. ఇక సమ్మర్లో ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్.