Balakrishna New Movie: బాలయ్య సినిమా కోసం ఫాంలో ఉన్న యంగ్ హీరో ? పోలీస్ ఆఫీసర్‏గా కనిపించనున్న..

|

Jan 31, 2021 | 11:25 AM

నందమూరీ బాలకృష్ణ, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ సాధించాయి.

Balakrishna New Movie: బాలయ్య సినిమా కోసం ఫాంలో ఉన్న యంగ్ హీరో ? పోలీస్ ఆఫీసర్‏గా కనిపించనున్న..
Follow us on

Nandamuri Balakrishna BoyapatiSrinu Movie: నందమూరీ బాలకృష్ణ, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. దీంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న బీబీ3 సినిమాపై అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇందులో బాలయ్యకు ప్రత్యర్థులుగా బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, నటుడు శ్రీకాంత్ నటిస్తున్నట్లుగా సమాచారం. తాజాగా ఈ సినిమాలో ఓ యంగ్ హీరో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ యంగ్ హీరో.. బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమాలో గెస్ట్ రోల్‏లో నటించనున్నట్లుగా సమాచారం. ఈ మూవీలో నాగశౌర్య పోలీస్ ఆఫీసర్‏గా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య సినిమాలో నిజంగానే నాగశౌర్య నటిస్తున్నాడా ? అనే విషయం ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈ మూవీ ఫుల్ యాక్షన్ ఎమోషనల్‏గా ఉండనున్నట్లు టాక్. ఇందులో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:

Krithi Shetty : ‘ఉప్పెన’లా ఎగసిపడుతున్న ఆఫర్లు.. రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్‌‌‌లో…

మెగా హీరో కోసం 200 కిలోమీటర్ల పాదయాత్ర.. ఆ అభిమాని కోసం హీరో ఏం చేశాడో తెలుసా ?