సుధా కొంగర దర్శకత్వంలో అజిత్‌.. రివీల్ చేసిన సంగీత దర్శకుడు

కోలీవుడ్ నటుడు తల అజిత్‌, సుధా కొంగర దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే

సుధా కొంగర దర్శకత్వంలో అజిత్‌.. రివీల్ చేసిన సంగీత దర్శకుడు

Updated on: Sep 21, 2020 | 7:09 PM

Ajith- Sudha Kongara movie: కోలీవుడ్ నటుడు తల అజిత్‌, సుధా కొంగర దర్శకత్వంలో నటించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మూడోసారి అజిత్‌, మహిళా దర్శకురాలి దర్శకత్వంలో నటించబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోగా.. ఈ ప్రాజెక్ట్‌పై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ క్లారిటీ ఇచ్చారు. అజిత్‌ని దృష్టిలో పెట్టుకొని సుధా కొంగర ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ని రాశారని, అది తాను విన్నానని జీవీ ప్రకాష్ తెలిపారు.

అంతేకాదు ఇది భారతీయ సినీ చరిత్రలో సుధా కొంగరను మరో స్టేజ్‌కి తీసుకెళ్తుందంటూ కితాబిచ్చారు. సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్న విజయ్ ప్రకాష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు ఇది కంప్లీట్‌గా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని, ఇంతవరకు ఇలాంటి కథ రాలేదని తెలిపారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌కి తాను సంగీతం అందించబోతున్నట్లు అభిమానులకే చెప్పకనే చెప్పారు. మరి ఈ కథను సుధా కొంగర, అజిత్‌కి వినిపించారా..? అజిత్‌ ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పారా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం అజిత్‌ వినోద్ దర్శకత్వంలో వలమై చిత్రంలో నటిస్తున్నారు. ఇక సూర్య హీరోగా సుధా కొంగర తెరకెక్కించిన ఆకాశమే హద్దురా ఈ నెల 30న ఓటీటీలో విడుదల కానుంది.

Read More:

అనురాగ్‌ చాలా సున్నితమైన వ్యక్తి.. శిష్యుడికి వర్మ మద్దతు

క్యాన్సర్ రోగుల కోసం 32 అంగుళాల జుట్టు ఇచ్చేసిన చిన్నారి

Loading...
Unable to load recommendations.
Follow Us