క్యాన్సర్ రోగుల కోసం 32 అంగుళాల జుట్టు ఇచ్చేసిన చిన్నారి

వయసు పదేళ్లే అయినా పెద్దగా ఆలోచించింది ఆ చిన్నారి. క్యాన్సర్ రోగుల కోసం ఏమైనా చేయాలని భావించి, గొప్ప నిర్ణయాన్నే తీసుకుంది

క్యాన్సర్ రోగుల కోసం 32 అంగుళాల జుట్టు ఇచ్చేసిన చిన్నారి
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2020 | 6:06 PM

Girl shaved her head: వయసు పదేళ్లే అయినా పెద్దగా ఆలోచించింది ఆ చిన్నారి. క్యాన్సర్ రోగుల కోసం ఏమైనా చేయాలని భావించి, గొప్ప నిర్ణయాన్నే తీసుకుంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టును వారి కోసం దానం చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌కి చెందిన దేవ్నా జనార్దన్‌ అనే పదేళ్ల చిన్నారి చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తుంది. ఆమెకు 32 అంగుళాల పొడవాటి జుట్టు ఉండగా.. దాన్ని క్యాన్సర్ రోగుల కోసం ఇచ్చేసింది. దీనిపై దేవ్నా మాట్లాడుతూ.. ‘నా జుట్టు దానం చేస్తే ఎవరైనా ఆనందం పొందుతారంటే.. వారి కోసం నా జుట్టును సంతోషంగా ఇచ్చేయాలనుకున్నా’ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు భవిష్యత్తులో క్యాన్సర్ స్పెషలిస్ట్ కావాలనుకుంటున్నానని తన కోరికను వెల్లడించింది. పదేళ్ల ఈ చిన్నారి చూపిన ఈ ఔదార్యంపై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తుండగా.. నువ్వు అనుకున్నది సాధించాలంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌