Guess the actress: ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టండి.. 20 ఏళ్లుగా తరగని అందం అమ్మాడి సొంతం.. ఇప్పటికీ అగ్రహీరోయిన్‏గా బిజీ బిజీ..

|

Jan 18, 2023 | 11:32 AM

సాధారణంగా హీరోయిన్లు ఎక్కువ కాలం లైమ్‌ లైట్‌లో ఉండడం చాలా అరుదైన విషయం. కొందరు నటీమణుల కెరీర్‌ను గమనిస్తే ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే ఓ నటీమణి మాత్రం ఏకంగా రెండు దశాబ్ధాలుగా హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. 24 ఏళ్లు గడుస్తోన్నా..

Guess the actress: ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టండి.. 20 ఏళ్లుగా తరగని అందం అమ్మాడి సొంతం.. ఇప్పటికీ అగ్రహీరోయిన్‏గా బిజీ బిజీ..
Guess The Actress
Follow us on

సాధారణంగా హీరోయిన్లు ఎక్కువ కాలం లైమ్‌ లైట్‌లో ఉండడం చాలా అరుదైన విషయం. కొందరు నటీమణుల కెరీర్‌ను గమనిస్తే ఎవరైనా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. అయితే ఓ నటీమణి మాత్రం ఏకంగా రెండు దశాబ్ధాలుగా హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. 24 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇండస్ట్రీలో కొన్నేళ్లు గడిచిందంటే చాలు సైడ్‌ క్యారెక్టర్‌తో సరిపెట్టుకుంటుంటారు. కానీ ఈ హీరోయిన్‌ మాత్రం ఇప్పటికీ లీడ్‌ రోల్‌లోనే నటిస్తూ మెప్పిస్తోంది.

సౌత్‌ ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. పైన ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారే మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్న హీరోయిన్‌. నాన్నకు పప్పీ ఇస్తూ చిరు నవ్వులు చిందుస్తున్న ఈ చిన్నారి సౌత్‌ ఇండస్ట్రీని కొన్నేళ్లు ఏలింది. 1999లో తమిళ ఇండస్ట్రీ ద్వారా వెండి తెర ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరింది. దాదాపు అందరు హీరోల సరసన ఆడిపాడింది. అనంతరం 2004లో తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సరసన ఆడిపాడి తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. తెలుగులో లీడ్‌ రోల్‌లో నటించిన తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలిమ్‌ ఫేర్‌ అవార్డ్‌ను దక్కించుకుంది. ఇంతకీ ఈ క్యూట్ గర్ల్‌ ఎవరో ఇప్పటికైనా కనిపెట్టారా.? అవును మీ గెస్‌ కరెక్టే ఈ చిన్నది మరెవరో కాదు అందాల తార చెన్నై బ్యూటీ త్రిష. 24 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ వరుస ఆఫర్లను దక్కించుకుంటుందీ బ్యూటీ. పొన్నియన్‌ సెల్వన్‌ ద్వారా మళ్లీ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విజయంతో త్రిషకు ఒకేసారి ఏకంగా మూడు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..