సమ్మర్‏ బరిలోకి దిగనున్న గోపీచంద్.. సీరియస్ లుక్‏లో కనిపిస్తున్న హీరో.. డేట్ ఎప్పుడో చెప్పేసాడుగా..

|

Jan 28, 2021 | 1:08 PM

హీరో గోపీచంద్‏తో కలిసి మాస్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం ‘సీటీమార్’. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా

సమ్మర్‏ బరిలోకి దిగనున్న గోపీచంద్.. సీరియస్ లుక్‏లో కనిపిస్తున్న హీరో.. డేట్ ఎప్పుడో చెప్పేసాడుగా..
Follow us on

హీరో గోపీచంద్‏తో కలిసి మాస్ డైరెక్టర్ సంపత్ నంది రూపొందిస్తున్న చిత్రం ‘సీటీమార్’. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్‏గా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.3 గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇక ఇప్పటికే మెగా హీరోలు వరుణ్ తేజ్, అల్లు అర్జున్‏లు తమ సినిమా విడుదల తేదీలను అనౌన్స్ చేయగా.. తాజాగా హీరో గోపీచంద్ కూడా తన సినిమా రిలీజ్ డేట్‏ను ప్రకటించాడు.

‘సీటీమార్’ సమ్మర్లో ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లుగా గోపీచంద్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఈ సందర్భంగా విడుదలతేదీతోపాటు గోపీచంద్ పోస్టర్‏ను కూడా విడుదల చేశాడు. అందులో సీరియస్ లుక్‏లో చేతిలో పెద్ద సుత్తి పట్టుకోని కూర్చున్నాడు గోపీచంద్. ఆంధ్రా టీం ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‏గా గోపీచంద్ నటిస్తుండగా… తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‏గా తమన్నా నటిస్తోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో తమన్నాతోపాటు హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తున్నట్లుగా టాక్. అలాగే సీనియర్ నటి భూమిక కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Also Read:

Pushpa Movie: ‘పుష్ప’ మూవీ సూపర్ అప్‏డేట్.. రఫ్ లుక్‏లో అదరగొట్టిన బన్నీ.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే ?