‘రొమాంటిక్‌’ సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్..!!

| Edited By:

Oct 15, 2019 | 1:51 PM

పూరి జగన్నాథ్ నిర్మిస్తోన్న సినిమాలో.. తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో.. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇండోర్‌ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోన్న సందర్భంగా ప్రమాదవ శాత్తూ.. ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మొదట ఒక క్లాత్‌కు అంటుకున్న మంటలు.. అక్కడ నుంచి మొత్తం సెట్‌కి వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు చిత్ర యూనిట్ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోలేదు. దీంతో.. చాలా నష్టం జరిగినట్టు చిత్ర యూనిట్ […]

రొమాంటిక్‌ సెట్‌లో ఫైర్ యాక్సిడెంట్..!!
Follow us on

పూరి జగన్నాథ్ నిర్మిస్తోన్న సినిమాలో.. తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో.. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇండోర్‌ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోన్న సందర్భంగా ప్రమాదవ శాత్తూ.. ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మొదట ఒక క్లాత్‌కు అంటుకున్న మంటలు.. అక్కడ నుంచి మొత్తం సెట్‌కి వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు చిత్ర యూనిట్ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోలేదు. దీంతో.. చాలా నష్టం జరిగినట్టు చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

అయితే.. షూటింగ్ సమయంలో.. అక్కడ ఆకాష్ పూరీ ఉన్నాడా.. లేడా అనే విషయం ఇంకా తెలియరాలేదు. నిన్న జరిగిన ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాని పూరి నిర్మిస్తుండగా.. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి అనిల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్నారు.