అరవై ఏళ్ల వ్యక్తి అయిన.. ఇంకా పదహారేళ్ల కుర్రాడే.. వైరల్‏గా మారిన ఫ్యామిలీ హీరో పోస్టర్..

|

Dec 26, 2020 | 8:15 PM

ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతిబాబు. తర్వాత కొంతకాలంపాటు నటనకు దూరంగా ఉండి.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‏లో మళ్ళీ తన మార్క్ చూపించాడు

అరవై ఏళ్ల వ్యక్తి అయిన.. ఇంకా పదహారేళ్ల కుర్రాడే.. వైరల్‏గా మారిన ఫ్యామిలీ హీరో పోస్టర్..
Follow us on

ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతిబాబు. తర్వాత కొంతకాలంపాటు నటనకు దూరంగా ఉండి.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‏లో మళ్ళీ తన మార్క్ చూపించాడు ఈ ఫ్యామీలీ హీరో. ప్రస్తుతం జగపతిబాబు ప్రధాన పాత్రలో ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది చిత్రబృందం. అయితే ఇటీవల ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా జగపతి బాబు ఉన్న పోస్టర్‏ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అరవై ఏళ్ళ వ్యక్తి అయినప్పటికీ.. పదహారేళ్ళే అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. #60 బట్ 16 అనే ట్యాగ్ లైన్‏తో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్ దామోదర్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొందర్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.