Anchor Shivani Sen: స్టార్‌ యాంకర్‌ హఠాన్మరణం.. ఆ సమస్యతో 36 ఏళ్లకే కన్నుమూత.. ప్రముఖుల నివాళులు

తన మాటల పలుకులతో వందలాది షోలు, ఈవెంట్లను సక్సెస్‌ఫుల్‌ చేసిన ప్రముఖ యాంకర్‌ శివానీ సేన్‌ హఠాన్మరణం చెందారు. ఎపిలెప్టిక్‌ అటాక్‌ అనే మెదడు సంబంధిత సమస్య కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. శివానీ వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం.

Anchor Shivani Sen: స్టార్‌ యాంకర్‌ హఠాన్మరణం.. ఆ సమస్యతో 36 ఏళ్లకే కన్నుమూత.. ప్రముఖుల నివాళులు
Anchor Shivani Sen

Updated on: Jul 11, 2023 | 8:16 AM

తన మాటల పలుకులతో వందలాది షోలు, ఈవెంట్లను సక్సెస్‌ఫుల్‌ చేసిన ప్రముఖ యాంకర్‌ శివానీ సేన్‌ హఠాన్మరణం చెందారు. ఎపిలెప్టిక్‌ అటాక్‌ అనే మెదడు సంబంధిత సమస్య కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. శివానీ వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శివానీకి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తున్నారు. కాగా 2005లో హోస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించారు శివానీ. ఆ తర్వాత పలు కార్పొరేట్ ఈవెంట్లు, కాన్ఫరెన్స్‌లు, ప్రభుత్వ కార్యక్రమాలు, మీడియా ఈవెంట్స్‌, సెలబ్రిటీల పెళ్లి వేడుకలు, ఫ్యాషన్‌ షోలు.. ఇలా సందర్భమేదైనా తన యాంకరింగ్‌తో ఆ ఈవెంట్లను సక్సెస్‌ చేసిందామె. హంస ఫర్‌ వెడ్డింగ్‌ అనే మ్యారేజ్‌ ఈవెంట్ కంపెనీలో భాగస్వామిగా ఉన్న ఆమె తెలంగాణా చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీని కూడా ప్రారంభించారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు శివానీ హోస్ట్‌గా వ్యవహరించారు. కేవలం మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో జరిగిన పలు ఈవెంట్లకు కూడా శివానీ హోస్ట్ గా వ్యవహరించారు. ఇక సినిమా ఇండస్ట్రీతోనూ ఆమెకు మంచి అనుబంధం ఉంది. సమంత, రాశీఖన్నా వంటి సెలబ్రిటీలతో శివానీకి పరిచయం ఉంది. ఈక్రమంలో చిన్న వయసులోనే శివానీ అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిచివేస్తోంది. శివానీకి పెళ్లై ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..