30 శాతమే బతికే చాన్స్ ఉందన్నారు: సోనాలి బింద్రే

|

Mar 09, 2019 | 8:12 AM

తనకు క్యాన్సర్ ఉందని తెలవగానే వైద్యులను సంప్రదించగా 30 శాతమే చాన్స్ ఉందని చెప్పనట్టు నటి సోనాలి బింద్రే గుర్తు చేసుకున్నారు. నాలుగో దశలో కేన్సర్ ఉన్న సోనాలి న్యూయార్క్‌ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. తనకు న్యూయార్క్ వెళ్లడం అసలు ఇష్టం లేదని.. తన భర్త గోల్డీ బెహల్ బలవంతం మీదనే వెళ్లానని తెలిపింది. విమానంలో కూడా.. మన దేశంలో మంచి వైద్యులు లేరా? వేరే దేశం ఎందుకు వెళ్లాలని భర్తతో పోట్లాడినట్టు సోనాలి వెల్లడించింది. న్యూయార్క్ […]

30 శాతమే బతికే చాన్స్ ఉందన్నారు: సోనాలి బింద్రే
Follow us on

తనకు క్యాన్సర్ ఉందని తెలవగానే వైద్యులను సంప్రదించగా 30 శాతమే చాన్స్ ఉందని చెప్పనట్టు నటి సోనాలి బింద్రే గుర్తు చేసుకున్నారు. నాలుగో దశలో కేన్సర్ ఉన్న సోనాలి న్యూయార్క్‌ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. తనకు న్యూయార్క్ వెళ్లడం అసలు ఇష్టం లేదని.. తన భర్త గోల్డీ బెహల్ బలవంతం మీదనే వెళ్లానని తెలిపింది.

విమానంలో కూడా.. మన దేశంలో మంచి వైద్యులు లేరా? వేరే దేశం ఎందుకు వెళ్లాలని భర్తతో పోట్లాడినట్టు సోనాలి వెల్లడించింది. న్యూయార్క్ వెళ్లిన మర్నాడే వైద్యుల్ని కలవగా పరీక్షలన్నీ చేసి తన ఆరోగ్య పరిస్థితి వివరించడంతో అప్పుడు తనకు పూర్తి వివరం తెలిసిందని, తనను న్యూయార్క్‌కి తీసుకెళ్లిన భర్తకు ధన్యవాదాలు తెలిపానట్టు సోనాలి చెప్పింది.