
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే నటులలో సయాజీ షిండే ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు ఆయన. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత విలన్‌గా, సహాయ నటుడిగా, తండ్రి పాత్రల్లో తనదైన శైలిలో మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో పెద్ద నటుడిగా మారారు. అయితే సయాజీ షిండే సినీ ప్రయాణం అంత సునయాసంగా జరగలేదు. ఆయన గొప్ప విజయం వెనుక ఆయన పడిన దశాబ్దకాలం కఠోర శ్రమ, ఎన్నో సవాళ్లు దాగి ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సయాజీ షిండే తన వ్యక్తిగత జీవితం, తొలి నాళ్ల పోరాటం, మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా వేలే కాంతి అనే చిన్న గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో సయాజీ షిండే జన్మించారు. 7వ తరగతి వరకు గ్రామంలోనే చదివిన ఆయన, ఆ తర్వాత పదో తరగతి పూర్తి చేశారు. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (D.Ed) పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని భావించారు. కానీ కనేర్ డ్యామ్ ప్రాజెక్ట్ కారణంగా వారి భూములు కోల్పోవడంతో జీవితం మలుపు తిరిగింది.
ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..
కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో రాత్రి వేళల్లో వాచ్‌మెన్‌గా చేరారు. రాత్రిపూట వాచ్‌మెన్ ఉద్యోగం చేస్తూనే, పగటిపూట కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తి చేశారు. ఆ కష్టానికి ఫలితంగా అదే డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా ప్రమోషన్ అందుకున్నారు. అయితే, నటనపై ఉన్న బలమైన ఆకాంక్ష ఆయనను స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకునేలా చేసింది. నటుడు కావాలనే ఏకైక లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై చేరుకున్నారు. తొలుత జీవనం కోసం ఒక బ్యాంకులో క్లర్క్‌గా ఆరు నెలలు పనిచేశారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..
దాదాపు పదేళ్ల పాటు ఈ విధంగా శ్రమించారు. 1987లో మొదటి నాటకంలో నటించినా, ప్రారంభంలో కొన్ని నాటకాల నుంచి ఆయనను తీసివేసిన సందర్భాలూ ఉన్నాయి. సయాజీ షిండే నటించిన హిందీ చిత్రం కలకత్తా మెయిల్ చూసి, నిర్మాత అశ్వనీదత్ మరియు అల్లు అరవింద్ ఆయనను తెలుగులో ‘ఠాగూర్’ సినిమా కోసం ఎంపిక చేశారు. అదే ఆయనకు మొదటి తెలుగు చిత్రం. ఠాగూర్ షూటింగ్ మొదటి రోజు అనుభవాన్ని షిండే పంచుకున్నారు. సెట్‌లో మెగాస్టార్ చిరంజీవి ఆయనను పలకరించి, “మీరు కంఫర్టబుల్‌గా ఉన్నారా?” అని అడిగారు. రంగాస్థల నటుడైన తనకు తెలుగు భాష, డైలాగుల ఉచ్చారణలో కొంత ఇబ్బందిగా ఉందని షిండే తెలిపారు. నాటకాల్లో వాయిస్‌కి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. వెంటనే స్పందించిన చిరంజీవి, దర్శకుడు వి.వి. వినాయక్‌తో మాట్లాడి ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను సయాజీ షిండే బస చేసిన హోటల్‌కు పంపించారు. తర్వాతి రోజు షూటింగ్ సీన్లకు సంబంధించిన డైలాగులను అర్థం చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఆ అసిస్టెంట్ ఎంతో సాయపడ్డారని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..
Sayaji Shinde New
ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..