
సినీరంగంలో కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గ్లామరస్ లుక్, నటనతో మెప్పించినప్పటికీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఆమె నిత్యం ఏదోక వార్తలలో నిలుస్తుంటుంది. ఆమె మరెవరో కాదు .. హీరోయిన్ తను శ్రీ. జంషెడ్‌పూర్‌లో జన్మించిన తనుశ్రీ, 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 2004 టైటిల్‌ను గెలుచుకుని, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. ఆమె 2005లో ‘ఆషిక్ బనాయా ఆప్నే’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె ఇమ్రాన్ హష్మితో కలిసి నటించింది. ఈ చిత్రంలోని పాటలు, ఆమె బోల్డ్ నటన కారణంగా ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది.
తనుశ్రీ దత్తా తన నటన వల్లే కాకుండా వివాదాల వల్ల కూడా వార్తల్లో నిలిచింది. ఆమె బాలీవుడ్‌లోని తప్పుల గురించి బహిరంగంగా మాట్లాడి, నానా పటేకర్ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది, ఇది పరిశ్రమలో పెద్ద దుమారం రేపింది. ఆమె జీవితంలోని ఒక విభిన్నమైన, రహస్యమైన కోణం వెలుగులోకి వచ్చింది. ఒక పాత ఇంటర్వ్యూలో, తనుశ్రీ తాను చిన్నప్పటి నుంచే ఆత్మలను, కనిపించని శక్తులను అనుభవిస్తున్నానని చెప్పింది. ఆమె చెప్పిన దాని ప్రకారం, ఆమె చిన్న వయసులోనే అలాంటి వాటిని చూసేది, వాటితో మాట్లాడేది కూడా అని చెప్పినట్లు తెలుస్తోంది.
కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరమైంది. ఆమె నటనకు బదలుగా ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించ… ధ్యానానికి ప్రాధాన్యత ఇచ్చింది. గ్లామర్ ప్రపంచానికి దూరమైంది. తెలుగులో 2006లో వీరభద్ర చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగు, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ మంచి స్థితిలో ఉన్నప్పుడే ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..
ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..