లైఫ్ ఎలా ఉన్నా బిందాస్‌గా నిలబడే ధైర్యం అతడిది.. అందుకే మళ్లీ జన్మలో అతడిలా పుట్టాలని కోరిక.. వివి వినాయక్..

దర్శకుడు వి.వి. వినాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. గతంలో అలీతో సరదాగా అనే కార్యక్రమంలో తన జీవితంలో ఉన్న కోరికను వెల్లడించారు. మరో జన్మంటూ ఉంటే తెలుగుకు చెందిన ఓ దర్శకుడిగా పుట్టాలని ఉందని అన్నారు. ఆయన ధైర్యం, వేగవంతమైన పనితీరు, ఆర్థిక కష్టాలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన విధానం తనకెంతో నచ్చిందని వినాయక్ తెలిపారు.

లైఫ్ ఎలా ఉన్నా బిందాస్‌గా నిలబడే ధైర్యం అతడిది.. అందుకే మళ్లీ జన్మలో అతడిలా పుట్టాలని కోరిక.. వివి వినాయక్..
Vv Vinayak

Updated on: Oct 26, 2026 | 6:03 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖుల్లో వి.వి. వినాయక్ , పూరీ జగన్నాథ్ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ తమదైన శైలి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అనేక సంచలనాలు సృష్టించారు. స్టార్ హీరోలతో అనేక హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం వివి వినాయక్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు పూరి మాత్రం కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో కలిసి స్లమ్ డాగ్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు వి.వి. వినాయక్ పూరీ జగన్నాథ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మళ్లీ జన్మంటూ ఉంటే తాను పూరీ జగన్నాథ్‌లా పుట్టాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొనడం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : SV Krishna Reddy: ఆమె అద్భుతమైన హీరోయిన్.. మధ్యతరగతి పాత్రలకు సరిగ్గా సెట్ అవుతుంది.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

ప్రముఖ హాస్యనటుడు అలీ నిర్వహించే పాపులర్ షో ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్న వి.వి. వినాయక్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ వ్యక్తిత్వం, ఆయన పనితీరుపై వినాయక్ ప్రశంసల జల్లు కురిపించారు. పూరీ జగన్నాథ్‌లో ఉండే ధైర్యం, తెగింపు అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గంలో ప్రయాణించే తీరు అద్భుతమని అన్నారు. సినిమా విడుదలైన తర్వాత హిట్టయినా, ఫ్లాప్ అయినా దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టే మనస్తత్వం పూరీ సొంతమని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..

అలాగే, కెరీర్‌లో ఎన్నోసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా, ఏమాత్రం కుంగిపోకుండా పూరీ జగన్నాథ్ వాటిని ఎదుర్కొన్న తీరు అభినందనీయమని వినాయక్ గుర్తుచేసుకున్నారు. కష్టకాలంలోనూ తన స్నేహితులతో విషయాలను పంచుకుంటూనే, ఎలాంటి నిరాశకు లోనుకాకుండా మళ్లీ వేగంగా కంబ్యాక్ ఇచ్చి నిలబడే తత్వం ఆయనలో చూసి తీరాల్సిందేనని అన్నారు . తన జీవితంలో ఎదురైన ఏ చెత్త పరిస్థితుల గురించి కూడా ఇతరుల ముందు ఎక్కువగా మాట్లాడకుండా, కేవలం తన పనిపైనే నమ్మకం ఉంచుతాడని ప్రశంసించారు. ఎప్పుడూ బిందాస్‌గా ఉంటూ, కష్టపడి సంపాదించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పూరీ జగన్నాథ్ లైఫ్ స్టైల్ తనకు చాలా ఇష్టమని వినాయక్ పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam: వాళ్లు ఏదో అనుకుంటారని ఆగకు.. జీవితంపై బ్రహ్మానందం చెప్పిన అద్భుతమైన మాటలు..

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

Loading...
Unable to load recommendations.
Follow Us