కలియుగ ‘సీత’ నా థీమ్ – తేజ

|

May 13, 2019 | 5:22 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సీత’. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా కథాంశం ఏంటి.? అసలు కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి కారణాలు ఏంటి.? బెల్లంకొండ ఎందుకు ఈ సినిమాను ఎందుకు అంగీకరించాడు.? ఇలాంటి ప్రశ్నలకు తేజ రీసెంట్ గా ఇచ్చిన టీవీ9 ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఫెమినిస్ట్ అని.. ఫెమినిజం.. […]

కలియుగ సీత నా థీమ్ - తేజ
Follow us on

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సీత’. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా కథాంశం ఏంటి.? అసలు కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి కారణాలు ఏంటి.? బెల్లంకొండ ఎందుకు ఈ సినిమాను ఎందుకు అంగీకరించాడు.? ఇలాంటి ప్రశ్నలకు తేజ రీసెంట్ గా ఇచ్చిన టీవీ9 ఇంటర్వ్యూలో స్పందించారు.

తాను ఫెమినిస్ట్ అని.. ఫెమినిజం.. స్త్రీ స్వేచ్ఛకు సపోర్ట్ చేస్తానని.. అందుకే నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత ‘సీత’ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను ఎంచుకున్నానని తేజ పేర్కొన్నారు. కాజల్ ఈ సినిమాపై చాలా ఆసక్తి చూపించింది.. ఆమె కథ విన్న వెంటనే.. ఈ సినిమా నేనే చేస్తాను.. ఎన్ని కాల్షీట్లు కావాలన్నా ఇస్తాను అంటూ చెప్పడంతో.. తనని హీరోయిన్ గా ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు.

పలువురు పెద్ద హీరోలతో చర్చలు జరిపిన తర్వాత బెల్లంకొండను ఓకే చేసినట్లు తేజ చెప్పారు. హీరోయిన్ ఓరియెంటెడ్ అయినా తప్పకుండా చేస్తానని బెల్లంకొండ వచ్చాడని ప్రశంసించారు. సీత సినిమా ద్వారా ఏవిధమైన సందేశం ప్రేక్షకులకు ఇవ్వబోనని అన్నారు. ఇక `సీత` చిత్రం వాల్మీకి రామాయణమా? తేజ రామాయణమా? అని ప్రశ్నిస్తే `నేటి రామాయణం` ఇది అని అన్నారు. సీత అగ్రెస్సివ్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేదే నా కథ. అమ్మాయిలు అగ్రెస్సివ్ గా ఉండాలి అని భావిస్తాను. అదే తెరపై చూపించాను అన్నారు. సీత అగ్రెస్సివ్ గా ఉంటే ఎలా ఉంటుంది? అన్నదే నా సినిమా… అని తేజ తెలిపారు.