The Paradise : నాని పాత్రకు జడలు పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ శ్రీకాంత్..

నేచురల్ స్టార్ నాని , దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ది ప్యారడైజ్'. 'దసరా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కలయికలో వస్తున్న రెండవ సినిమా ఇది. సెప్టెంబర్ 24, 2026న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్ తదితర భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సొనాలీ కులకర్ణి, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు

The Paradise : నాని పాత్రకు జడలు పెట్టడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ శ్రీకాంత్..
Srikanth Odel

Updated on: Sep 19, 2026 | 8:33 PM

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

శ్రీకాంత్ గారు.. ఈ కథకు స్ఫూర్తి ఏమిటి?

-ఈ కథకు నిజ జీవిత సంఘటన, కొన్ని పాత్రలు, అలాగే ఫిక్షన్.. ఈ మూడు ఉన్నాయి.

-మా అమ్మగారు ఆడపిల్ల పుడితే బాగుంటుందని భావించారు. కానీ పుట్టలేదు. నాకే జడలు వేసి, గౌన్ వేసి పెంచారు. నా రెండో క్లాస్ వరకు నాకు జడలు ఉండేవి. జడలు అక్కడి నుంచి తీసుకున్నాను. దీని వెనుక కూడా చాలా ఎమోషన్ ఉంటుంది.

– ఇందులో ఉండే రెవల్యూషన్, ఆ పాత్రలను నేను పుట్టి పెరిగిన గోదావరిఖని ప్రాంతం నుంచి స్ఫూర్తి పొందినవి. ఆదిలాబాద్, గోదావరిఖని ప్రాంతాల మధ్యలో జరిగిన సంఘటనలు తీసుకున్నాను. నేను సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్‌లో ఉన్నాను. ఆ పక్కన ఉండే బస్తీలో జరిగే కథలాగా డిజైన్ చేశాను. మా ఊర్లో నేను చూసిన సంఘటనలన్నీ మళ్లీ ఇక్కడ నాకు కనెక్ట్ అయ్యాయి.

ఇందులో నానిని ఎలా చూపించాలని అనుకున్నారు? దసరాలో మిస్ అయిన నాని ఇందులో చూపిస్తారని విన్నాం ?

-‘దసరా’ని ఒక మంచి డ్రామాగా చేయాలనేది నా ఉద్దేశం. కాకపోతే ప్రమోషనల్ కంటెంట్ చూసి అదొక ‘కేజీఎఫ్’లా చాలా మాస్‌గా ఉంటుందని అనుకున్నారు. థియేటర్‌లోకి వెళ్లి చూసిన తర్వాత ప్యూర్ డ్రామా ఉంది. ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యారని నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. కాకపోతే రెండు రోజుల తర్వాత దానికి ట్యూన్ అయిపోయారు. సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. రికార్డ్స్ వచ్చాయి.

-కాకపోతే అప్పుడు ఆడియన్స్ కోరుకునేది తీస్తే అది కమర్షియల్‌గా హై ఫీల్ అవుతారు కదా అని అనిపించి, అలా నాని గారి దగ్గరికి వెళ్లి ఈ ఆలోచన చెప్పాను. ఆడియన్స్ కోరుకునేది ఇవ్వాలని ఉద్దేశంతో ఇప్పుడు ‘ప్యారడైజ్’ తీసుకొస్తున్నాం.

-‘ప్యారడైజ్’లో యాక్షన్, ఎమోషన్స్, మదర్ అండ్ సన్ ఎమోషన్ అన్నీ కూడా బ్లెండ్ అయి ఉంటాయి. అయితే నాకు అడిగితే యాక్షన్ కంటే ఎమోషన్ డామినేట్ చేస్తుందని భావిస్తున్నాను. ఆడియన్స్ ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్‌కు చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతారు.

ట్రైలర్ ఇవ్వకపోవడం వెనుక కారణం?

-ముందే చెప్పినట్టు ఆ ట్రైలర్ కట్ చేయడానికి చాలా సమయం కావాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత సమయం ట్రైలర్ కి కేటాయించలెం. నేను ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలనుకుంటున్నాను. కానీ నాకు పర్సనల్‌గా అడిగితే.. మనం చిన్నప్పుడు ఏమీ చూడకుండానే థియేటర్‌లోకి వెళ్లి ప్రతి మూమెంట్‌కు సర్‌ప్రైజ్ అయ్యేవాళ్లం. నాకు పర్సనల్‌గా అలా నేరుగా థియేటర్‌కి వెళ్లి సర్‌ప్రైజ్ అవ్వడమే ఇష్టం. నా నెక్స్ట్ సినిమాకి సాధ్యమైనంత తక్కువ అప్‌డేట్స్‌తోనే సినిమాని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాను.

చివరి 40 రోజులుగా మీరు, మీ టీం అసలు ఇంటికి కూడా వెళ్లలేదని విన్నాము?

నేను ఏదైనా మనస్ఫూర్తిగా, నేను అనుకున్నది వచ్చేంతవరకు చేస్తాను. ఈ విషయంలో మా టీంను ఇబ్బంది పెట్టాను. (నవ్వుతూ) నేను అనుకున్న షాట్ వచ్చేంతవరకు వందసార్లు అయినా తీస్తాను. కానీ ఒకసారి ఓకే అయిన తర్వాత మళ్లీ రీషూట్ జోలికి వెళ్లను.

షూటింగ్‌లో జాప్యం జరగడానికి కారణం?

-నేను అనుకున్న విధంగా షూట్ చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. దాని కారణంగా డేస్ పెరిగాయి. ఒకరోజు టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్‌లో ఫినిష్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఆ టార్గెట్ ఫినిష్ చేయలేకపోయాను. దానివల్ల మళ్లీ అందరి డేట్స్ అడ్జస్ట్ చేసి చేయాల్సి వచ్చింది. అంతేగానీ కంటెంట్, రీషూట్ అనేది సమస్య కాదు. ఈ సినిమా కోసం ఎక్కడా రీషూట్‌లు చేయలేదు. అలాగే మొదట ఏదైతే బౌండ్ స్క్రిప్ట్ అనుకున్నానో దాని ప్రకారమే చేశాను.

నాని గారితో మీకు చాలా అనుబంధం ఉంది కదా?

-నాని గారు, నేను అన్నదమ్ముల్లాగే మాట్లాడుకుంటాం. నాకు దర్శకుడిగా జీవితం ఇచ్చారు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయనతో నేను ప్రతిదీ చెప్తాను.

మోహన్ బాబు పాత్ర గురించి?

-ఈ కథకి ఆయన పాత్ర చాలా కీలకం. మోహన్ బాబు గారు, నాని గారి క్యారెక్టర్స్ పేస్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

సంపూర్ణేష్ పాత్ర గురించి?

-సంపూ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. సంపూర్ణేష్ బాబు పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది.

అనిరుధ్ మ్యూజిక్ గురించి?

-అనిరుధ్‌తో పని చేయడం చాలా హాయిగా ఉంటుంది. నేను ఏం చెప్పాలనుకున్నానో క్లియర్‌గా అర్థం అవుతుంది. మనకున్న మెంటల్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉంటే దాని కిక్కు వేరుగా ఉంటుంది. (నవ్వుతూ) ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో అలా చేశాం. ఇందులో బిట్స్ సాంగ్స్ కలుపుకొని మొత్తం ఆరు పాటలు ఉంటాయి.

ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా?

-ఈ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ ఏమీ లేదు. ఇది సింగిల్ మూవీ.

‘ఏష నాగుల’ పాట గురించి?

నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఆటోలో ప్రతిరోజూ ఆ పాట పెట్టేవారు. అనిరుధ్‌కి ఐడియా చెబితే చాలా అద్భుతంగా చేశాడు. నిజానికి ‘దసరా’లోనే ఆ పాట పెట్టాలని అనుకున్నాను. ఇందులో కుదిరింది. నాకు జానపద గీతాలు అంటే చాలా ఇష్టం.

ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు?

-170 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొదట ప్లానింగ్ ప్రకారం 160 రోజుల్లో అయిపోతుంది అనుకున్నాను. కానీ సినిమా వెళ్తున్న ఫ్లోలో ఒక పది రోజులు పెరిగింది.

అసలు మీకు సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది?

-నేను తొమ్మిదో క్లాసులో ఉండగా ‘జగడం’ సినిమా వచ్చింది. ఆ సినిమాని థియేటర్‌లో చూసి నేను కూడా సినిమా తీయాలని బలంగా ఫిక్స్ అయిపోయాను. ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. నేరుగా సుకుమార్ గారిని కలవడానికి వెళ్లాను. పొద్దున లేచి ఆయన గేటు దగ్గర నిలబడటమే నాకు పని. అలా నాలుగేళ్లు అయిన తర్వాత ఆయన ఒక షార్ట్ ఫిలిం చేసి తీసుకురమ్మన్నారు. అది చూసి జాయిన్ చేసుకున్నారు. ఆయన దగ్గర ‘రంగస్థలం’ సినిమాకి పని చేశాను.

-కృష్ణవంశీ గారు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, శేఖర్ కమ్ముల గారు, పూరి గారు.. వీళ్ల ప్రభావం నా మీద బలంగా ఉంటుంది.

చిరంజీవి గారితో సినిమా గురించి?

-‘ప్యారడైజ్’ రిలీజ్ అయిన తర్వాత ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. బ్రెయిన్‌కి రెస్ట్ కావాలి. ఇదే విషయాన్ని చిరంజీవి గారితో కూడా చెప్పాను.(నవ్వుతూ) కాస్త ఫ్యామిలీ సమయం గడపాలని అనుకుంటున్నాను. చిరంజీవి గారితో సినిమా 100% ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Loading...
Unable to load recommendations.
Follow Us