Dhee Pandu: నడవలేని స్థితిలో బెడ్ పై ఢీ ఫేమ్ పండు మాస్టర్.. దయచేసి సపోర్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్.. వీడియో వైరల్..

పండు మాస్టార్.. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఢీ షో ద్వారా ఫేమస్ అయిన పండు.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో రెండు కాళ్లు తీవ్రంగా గాయపడడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. పండు కొన్నాళ్లుగా బెడ్డు మీదే ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో పండు షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

Dhee Pandu: నడవలేని స్థితిలో బెడ్ పై ఢీ ఫేమ్ పండు మాస్టర్.. దయచేసి సపోర్ట్ చేయండి అంటూ రిక్వెస్ట్.. వీడియో వైరల్..
Pandu Master

Updated on: Sep 16, 2026 | 4:10 PM

బుల్లితెరపై తన మార్క్ డ్యాన్స్‌తో, కామిడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘ఢీ’ ఫేమ్ పండు (పండు మాస్టర్) ఇటీవల ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వైద్యులు రెండు కాళ్లకు ఆపరేషన్ కూడా చేశారు. ప్రస్తుతం ఆయన కదల్లేని స్థితిలో బెడ్డుపైనే విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ స్టేజ్‌పై మునుపటిలా డ్యాన్స్ స్టెప్పులు వేయడానికి ఆయనకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది.ఈ క్రమంలో పండుకు ఉపాధి లేదా ఆదాయ మార్గం తాత్కాలికంగా ఆగిపోయింది. సాధారణంగా బుల్లితెర కళాకారులకు ప్రాజెక్ట్‌లు ఉన్నప్పుడే ఆదాయం వస్తుంది. నిలబడే పరిస్థితి లేకపోవడంతో పండుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఏర్పడింది. అందుకే ఆయన సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులను అలరించిన పండు, ఇకపై తన హెల్త్ అప్‌డేట్స్, వ్యక్తిగత విషయాలు, ఇతర విశేషాలను యూట్యూబ్ ద్వారా పంచుకోనున్నారు.

బెడ్డు మీద నుంచే ఒక ప్రత్యేక వీడియోను షూట్ చేస్తూ – “ఇన్నాళ్లూ నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పటివరకు ఇన్‌స్టాలో ఎంటర్‌టైన్ చేశాను. ఇకపై నా అప్‌డేట్స్ అన్నీ యూట్యూబ్‌లోనే ఇస్తాను. నా కొత్త ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి” అని అభిమానులను, నెటిజన్లను వేడుకున్నారు.

‘ఢీ’ షోలో ఒక సాధారణ డ్యాన్సర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన పండు, తన ప్రతిభతో కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా ‘నక్కిలీసు గొలుసు’ పాటతో ఆయన క్రేజ్ రాత్రికి రాత్రే పెరిగిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు పాపులర్ షోలు, పండుగ ఈవెంట్లలో పాల్గొంటూ మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.పండు ప్రమాదానికి గురైన విషయం తెలిసి ‘ఢీ’ టీమ్‌తో పాటు యాంకర్ సుమ వంటి ప్రముఖులు కూడా ఆయనకు అండగా నిలిచారు. ఇటీవల ప్రారంభమవుతున్న కొత్త ‘ఢీ’ సీజన్‌లో పండు లేకపోవడం ఆయన అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఏది ఏమైనా, పండు త్వరగా కోలుకొని మళ్లీ డ్యాన్స్ ఫ్లోర్‌పైకి రావాలని ఆకాంక్షిస్తూ, ఆయన కొత్త యూట్యూబ్ ఛానెల్‌కి అభిమానులు భారీగా సపోర్ట్ అందిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..

పండు మాస్టార్ ఇన్ స్టా..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..

సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us