సాధరణంగా సెలబ్రెటీలు తమ వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాల గురించి ఎక్కడో ఒకచోట బయటపెడుతూనే ఉంటారు. ఇక అభిమానులు కూడా తమ ఫేవరెట్ సెలబ్రేటీల గురించి పూర్తి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తాజాగా సీరియల్ నటి, బిగ్బాస్ కంటెస్టెంట్ దేవొలీనా భట్టాచార్య కూడా తన ప్రేమ గురించి బయటపెట్టింది. గతంలో దేవోలినా బిగ్బాస్ సీజన్ 13లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కానీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా షో మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది.
తాజాగా ప్రస్తుతం హిందీలో ప్రసారమవుతున్న బిగ్బాస్ సీజన్ 14లో ఇజాజ్ ఖాన్ స్థానంలోకి ఛాలెంజర్గా అడుగుపెట్టింది దేవోలినా. హౌస్లోకి ఎంటర్ అయిన దేవోలినా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించింది తోటి కంటెస్టెంట్ రాఖీ సావంత్. ఈ క్రమంలోనే తోటి కంటెస్టెంట్ రాహుల్ వైద్య అంటే నీకు ఇష్టమేనా అని అడుగగా.. తాను వేరోక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా దేవోలినా చెప్పుకొచ్చింది. కానీ అతడికి సంబంధించిన వివరాలను మాత్రం బయటపెట్టలేదు. దేవోలినా హిందీలో “సాథ్ నిభానా సాథియా” సీరియల్లో గోపిగా నటించారు. ఇక అదే సీరియల్ తెలుగులో కోడలా “కోడలా కొడుకు పెళ్ళామా” పేరుతో ప్రసారం కాగా.. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు గోపిగా మంచి గుర్తింపు పొందింది.
Also Read:
Actress Shruthi haasan: శృతిహాసన్ ఎక్కడా తగ్గడం లేదుగా.. ‘సలార్’ కోసం భారీగా రెమ్యునరేషన్ ?