Devi Sri Prasad: ఎనర్జిటిక్ స్టార్ హీరో కోసం మరోసారి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడానికి సిద్దమైన రాక్ స్టార్…

యంగ్ హీరో రామ్ ప్రస్తుతంమంచి జోష్ లో ఉన్నాడు. ఇటీవల వరుసగా పరాజయాలు పలకరించినా ఏమాత్రం నిరాశపడకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Devi Sri Prasad: ఎనర్జిటిక్ స్టార్ హీరో కోసం మరోసారి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వడానికి సిద్దమైన రాక్ స్టార్...
Devi Sri Prasad

Updated on: Apr 16, 2021 | 6:53 AM

Devi Sri Prasad: యంగ్ హీరో రామ్ ప్రస్తుతంమంచి జోష్ లో ఉన్నాడు. ఇటీవల వరుసగా పరాజయాలు పలకరించినా  ఏమాత్రం నిరాశపడకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశారు. అప్పటివరకు లవర్ బాయ్ గా కనిపించిన రామ్ . ఈ సినిమాతో మాస్ హీరో గా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా మాస్ మసాలా మూవీగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈసినిమాలో రామ్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. సూపర్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ‘#RAPO19’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ అని చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు. గతంలో రామ్ నటించిన ‘జగడం’ ‘రెడీ’ ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘శివమ్’ ‘హలో గురూ ప్రేమకోసమే’ సినిమాలకు దేవీ సంగీతం అందించారు. వీటిలో అన్ని సినిమాల సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మరి రామ్ కెరియర్ లో 19వ సినిమా గా వస్తున్న ఈ సినిమాకు దేవీ ఏరేంజ్ లో సంగీతం అందిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

 

Loading...
Unable to load recommendations.
Follow Us