9 ఏళ్ల క్రితం చిత్రం.. ఆర్యపై పరువు నష్టం దావా

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆర్యపై నెల్లై అంబసముద్రం కోర్టులో పరువు నష్టం దావా కేసు నమోదైంది

9 ఏళ్ల క్రితం చిత్రం.. ఆర్యపై పరువు నష్టం దావా

Edited By:

Updated on: Sep 18, 2020 | 5:44 PM

Defamation Case Arya: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆర్యపై నెల్లై అంబసముద్రం కోర్టులో పరువు నష్టం దావా నమోదైంది. అయితే 9 ఏళ్ల క్రితం నాటి చిత్రం గురించి ఇప్పుడు అతడిపై పరువు నష్టం దావా నమోదు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. బాల దర్శకత్వంలో ఆర్య, విశాల్‌ ఇద్దరు అవన్ ఇవన్(తెలుగులో వాడు-వీడు) అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆర్య, విశాల్ ఇద్దరి పాత్రలకు గానూ సర్వత్రా ప్రశంసలు లభించాయి. అయితే ఇందులో సింగంపట్టి జమీన్‌ పాత్రను ఆర్య కించపరిచాడని ఇప్పుడు పరువు నష్టం దావా నమోదైంది.

ఇక ఈ కేసుకి సంబంధించి సెప్టెంబర్ 28న ఆర్య, తమ ముందు విచారణకు హాజరు అవ్వాలని కోర్టు ఆదేశించింది. మరి ఈ కేసులో ఆర్య ఎలా ముందుకు వెళ్తారు..? దీనిపై మూవీ దర్శకుడు బాల, ఆర్యకు మద్దతును ఇస్తారో.. లేదో..? చూడాలి. కాగా ఆర్య ప్రస్తుతం ‘టెడ్డి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ‘3 దేవ్’ అనే మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Read More:

Bigg Boss 4: గంగవ్వకు కరోనా పరీక్ష..!

ధైర్యమే బలం: కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు

Follow Us