సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ టైమ్స్‌లో అతను బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. ఏడాది కింద గీత గోవిందం ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసి విజయ్ స్టామినా ఏంటో చూపించింది. ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా కూడా మంచి వసూళ్లను సాధించింది. అంతేకాదు విజయ్‌కు కూాడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ఫడింది. విభిన్నమైన సినిమాలతో విజయ్ హిట్స్ కొడుతూ ఉండటంతో.. ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . ఈ సినిమా విడుదల తేదీ తాజాగా కన్ఫర్మ్ అయింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అన్ని భాషల్లోనూ జులై 26నే విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంతో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ కొడతానంటూ ధీమాగా చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. పైగా ఈ మధ్యే విడుదలైన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. రష్మికా మందనా ఈ సినిమాలో మరోసారి విజయ్ పక్కన జోడీగా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్నాడు.
Comrades, Attention!
26th July 2019. ✊
– Vijay Deverakonda. pic.twitter.com/1IVfbwBxon
— Vijay Deverakonda (@TheDeverakonda) May 8, 2019