Bigg Boss Telugu: ‘హౌజ్‌లోకి వింత జంతువులు వచ్చాయి’.. బిగ్‌బాస్‌పై మరోసారి ధ్వజమెత్తిన నారాయణ..

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎక్కడో అమెరికాలో మొదలైన ఈ రియాలిటీ షో తెలుగు రాష్ట్రాల వరకు వ్యాపించిందంటేనే ఈ షోకి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు...

Bigg Boss Telugu: హౌజ్‌లోకి వింత జంతువులు వచ్చాయి.. బిగ్‌బాస్‌పై మరోసారి ధ్వజమెత్తిన నారాయణ..
Narayana Fires On Biggboss

Updated on: Sep 06, 2022 | 6:10 AM

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎక్కడో అమెరికాలో మొదలైన ఈ రియాలిటీ షో తెలుగు రాష్ట్రాల వరకు వ్యాపించిందంటేనే ఈ షోకి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఈ షోపై పెద్దల నుంచి చిన్నారుల వరకు విపరీతమైన క్రేజ్‌. ఇక టీఆర్‌పీ రేటింగ్స్‌తో దుమ్మురేపే ఈ షోకి ప్రశంసలతో పాటు విమర్శలు సైతం ఎదురవుతుంటాయి. ఇలా బిగ్‌బాస్‌ షోని వ్యతిరేకించే వారిలో సీపీఐ జాతీయ కార్యదర్శని నారాయణ మొదటి వరుసలో ఉంటారు.

ప్రతీసారి కొత్త సీజన్‌ ప్రారంభంలో బిగ్‌బాస్‌ నిర్వాహకులపై తనదైన శైలిలో విమర్శించే నారాయాణ తాజాగా బిగ్‌బాస్‌ 6వ సీజన్‌పై కూడా సంచనల కామెంట్స్‌ చేశారు. ఈ విషయమై తాజాగా మాట్లాడుతూ.. ‘కాసులకు కక్కుర్తి పడేవాళ్లు ఉన్నంత కాలం బిగ్‌బాస్‌లాంటి షోలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అసలు ఈ షోతో ఏం సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాలి. బిగ్‌బాస్‌ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా.? బిగ్‌బాస్‌ అనేది ఒక అనైతిక షో. వింత జంతువులు ఈ హౌజ్‌లోకి వచ్చాయి’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విమర్శించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్ లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు తాజాగా మరో కొత్త సీజన్ సెప్టెంబర్ 4న మొత్తం 21 మంది కంటెస్టెంట్లతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సినీ, బుల్లి తెరకు చెందిన పలువురు ప్రముఖులు ఈ షోలో పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..