పెళ్లి ఏర్పాట్లు.. ప్రముఖ యాంకర్, మహేష్‌ బంధువుపై కేసు నమోదు..!

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రముఖ యాంకర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన గెస్ట్‌ హౌస్‌లో పెళ్లి చేసేందుకు

పెళ్లి ఏర్పాట్లు.. ప్రముఖ యాంకర్, మహేష్‌ బంధువుపై కేసు నమోదు..!

Edited By:

Updated on: Apr 21, 2020 | 11:48 AM

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రముఖ యాంకర్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన గెస్ట్‌ హౌస్‌లో పెళ్లి చేసేందుకు అతడు భారీ ఏర్పాట్లు చేయడంతో పాటు గెస్ట్‌లను పిలిచేందుకు కూడా ఆయన సిద్ధం కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో రియాల్టీ షోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అకుల్ బాలాజీ బెంగళూరులోని తన గెస్ట్‌ హౌస్‌లో పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేశారు. అందులో లాక్‌డౌన్ నిబంధనలను ఆయన ఉల్లంఘించారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా కన్నడలో ‘మానే ముండే మహాలక్ష్మి’, ‘ప్యాతే హుద్గిర్ హల్లీ లిఫు సీజన్‌ 1&2’, ‘హోసా లవ్‌ స్టోరీ’ లాంటి రియాలటీ షోలకు ఆయన హోస్ట్‌గా చేశారు. ఇక తెలుగులోనూ ‘పెళ్లినాటి ప్రమాణాలు’ అనే సీరియల్‌, ‘312 గో’ అనే షోకు ఆయన వ్యాఖ్యాతగా పనిచేశారు. కాగా ఈ నటుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుకు కాస్త దూరపు బంధువు.

Read This Story Also: ఛాలెంజ్‌ స్వీకరించిన ఎన్టీఆర్.. చిరు, బాలయ్యతో పాటు వారికి సవాల్..!