చిరు ప్రశంసలు.. తబ్బుబ్బిపోతున్న యంగ్ హీరో

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:54 PM

నిఖిల్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు టి. సంతోష్ తెరకెక్కించిన చిత్రం అర్జున్ సురవరం. తమిళంలో విజయం సాధించిన కణిథన్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. మెగాస్టార్ చిరంజీవి సైతం టీజర్‌పై ప్రశంసలు కురిపించాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన నిఖిల్.. ఆనందంలో తబ్బుబ్బిపోతున్నాడు. ‘‘మా నిర్మాత రాజ్ కుమార్ తన ఫోన్‌కు వచ్చిన కొన్ని మెసేజ్‌లు చూస్తూ ఆనందపడిపోవడం […]

చిరు ప్రశంసలు.. తబ్బుబ్బిపోతున్న యంగ్ హీరో
Follow us on

నిఖిల్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు టి. సంతోష్ తెరకెక్కించిన చిత్రం అర్జున్ సురవరం. తమిళంలో విజయం సాధించిన కణిథన్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. మెగాస్టార్ చిరంజీవి సైతం టీజర్‌పై ప్రశంసలు కురిపించాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన నిఖిల్.. ఆనందంలో తబ్బుబ్బిపోతున్నాడు.

‘‘మా నిర్మాత రాజ్ కుమార్ తన ఫోన్‌కు వచ్చిన కొన్ని మెసేజ్‌లు చూస్తూ ఆనందపడిపోవడం నేను చూశాను. వెంటనే ఆ ఫోన్‌ను నేను తీసుకున్నా. అందులో మెగాస్టార్ చిరంజీవి గారు అర్జున్ సురవరం టీజర్‌ను ప్రశంసించారు. అది చూసి నమ్మలేకపోయా. ఇప్పుడు చాలా సంతోషంలో ఉన్నా’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా అర్జున్ సురువరంపై స్పందించిన మెగాస్టార్.. ‘‘అర్జున్ సురవరం టీజర్ చూశా. చాలా ఆసక్తిగా. నీకు, నిఖిల్‌కు, దర్శకుడికి ఆల్ ది బెస్ట్’’ అంటూ మెసేజ్ రాజ్ కిరణ్‌కు మెసేజ్ చేశాడు.