పవన్‌ దర్శకుడికి ఓకే చెప్పిన చిరు.. అన్నీ కుదిరితే..!

పవన్‌ దర్శకుడికి ఓకే చెప్పిన చిరు.. అన్నీ కుదిరితే..!

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత 'లూసిఫర్' రీమేక్‌లో నటించనున్నారు. ఈ రీమేక్‌కు 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 13, 2020 | 2:36 PM

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తరువాత ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించనున్నారు. ఈ రీమేక్‌కు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చిరు అధికారికంగా ప్రకటించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సుజీత్ ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు మరో దర్శకుడికి చిరు ఓకే చెప్పినట్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనెవరంటే.. డైరక్టర్ బాబీ.

ఇటీవల చిరును కలిసిన ఈ దర్శకుడు.. మెగాస్టార్‌కు ఓ కథను వినిపించారట. ఆ కథ చిరుకు బాగా నచ్చిందని.. వెంటనే ఓకే చెప్పారన్న టాక్ ఫిలింనగర్‌లో నడుస్తోంది. ఈ కథకు సంబంధించిన బాబీ ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేసే పనుల్లో పడ్డట్లు తెలుస్తోంది. అంతేకాదు లాక్‌డౌన్ తరువాత ఈ మూవీపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా గతేడాది వెంకటేష్, నాగచైతన్యలు హీరోలుగా బాబీ.. ‘వెంకీ మామ’ను తెరకెక్కించారు. ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ.. కమర్షియల్‌గా విజయాన్ని సాధించింది.

Read This Story Also: ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu