సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. వాంతులు, విరేచనాలతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మృతి.. గొంతు వద్ద ఇంజెక్షన్‌ చేయడంతో..

ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకుంటోన్న ఛైల్డ్ ఆర్టిస్ట్‌ సించన అనుమానాస్పద స్థితితో కన్నుమూసింది. వాంతులు, విరోచనాల కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయినట్లు సంచిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. వాంతులు, విరేచనాలతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మృతి.. గొంతు వద్ద ఇంజెక్షన్‌ చేయడంతో..
Child Artist Sinchana
Follow us

|

Updated on: Feb 05, 2023 | 2:51 PM

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తమ నటనా ప్రతిభతో సినీ ప్రేక్షకులను అలరించిన తారలు ఒక్కొక్కరూ లోకాన్ని విడిచి పెళ్లిపోతున్నారు. తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే నటిగా నిలదొక్కుకుంటోన్న ఛైల్డ్ ఆర్టిస్ట్‌ సించన అనుమానాస్పద స్థితితో కన్నుమూసింది. వాంతులు, విరోచనాల కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతూ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయినట్లు సంచిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. బెంగళూరులోఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన సంజనా అనే 15 ఏళ్ల సంచిత పదో తరగతి చదువుతోంది. ఓ వైపు చదువుతూనే మరో వైపు దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది. అలాగే పలు సినిమాల్లో జూనియర్‌ డ్యాన్సర్‌గా, ఛైల్డ్‌ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తోంది . ఈ నేపథ్యంలోనే సంచిత కొద్దిరోజుల క్రితం వాంతులు, విరేచనాలకు గురైంది. దీంతో వెంటనే ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

అక్కడి వైద్యులు ఆమెకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేదు. చికిత్స పొందుతూ శనివారం సించన చనిపోయింది. అయితే ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని సంజన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సించనకు గొంతు వద్ద ఇంజక్షన్‌ ఇవ్వడంతో రక్తస్రావం ఎక్కువై మృతి చెందినట్లు పేరెంట్స్‌ చెబుతున్నారు. తమకు న్యాయం జరగాలంటూ హాస్పటిటల్‌ ఆందోళనకు దిగారు. దీనిపై బాగలగుంటె పోలీసులను ఆశ్రయించారు. ఆసుపత్రిపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.