CCL: షార్జాలో సీసీఎల్ సందడి.. తొలి మ్యాచ్‌లో భోజ్‌పురి దబంగ్స్, తెలుగు వారియర్స్ ఢీ..
షార్జాలో ఈ మధ్యాహ్నం 2 గంటలకు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ జరగనుంది. భోజ్‌పురి దబంగ్స్‌తో తెలుగు వారియర్స్ తలపడబోతున్నారు. పదో సీజన్‌లో 8 సినీ పరిశ్రమల నుంచి 8 జట్లు పాల్గొంటున్నాయి. బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్నాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబయి హీరోస్, తెలుగు వారియర్స్,
షార్జాలో ఈ మధ్యాహ్నం 2 గంటలకు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ జరగనుంది. భోజ్‌పురి దబంగ్స్‌తో తెలుగు వారియర్స్ తలపడబోతున్నారు. పదో సీజన్‌లో 8 సినీ పరిశ్రమల నుంచి 8 జట్లు పాల్గొంటున్నాయి. బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్నాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబయి హీరోస్, తెలుగు వారియర్స్, పంజాబ్ డీ షేర్స్, భోజ్‌పురి దబంగ్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తలపడబోతున్నాయి. ఇప్పటివరకు జరిగిన CCL సీజన్స్ లో తెలుగు వారియర్స్ నాలుగుసార్లు విజేతగా నిలిచి ట్రోఫీ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. గత ఏడాది సీజన్ లో కూడా తెలుగు హీరోలే విజేతలుగా నిలిచారు. తెలుగు వారియర్స్ కి అక్కినేని అఖిల్ కెప్టెన్ చేస్తుంటే సచిన్ జోషి యజమానిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో వచ్చే నెల 1 నుంచి 3 వరకు రెండో దశ సెలబ్రెటీ క్రికెట్ లీగ్ పోటీలు జరగనున్నాయి. రోజుకు రెండు మ్యాచ్‌లు చొప్పన 3 రోజులు 6 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిగే మ్యాచ్ కోసం భోజ్‌పురి దబంగ్స్, తెలుగు వారియర్స్ జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. విజయంపై ధీమా వ్యక్తం చేశారు తెలుగు వారియర్స్.