Viral Photo: ఈ ఫొటోలో ముద్దులొలికేలా ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడీమె ఓ బడా హీరోయిన్‌..

Viral Photo: నటీమణులు ఇటీవల తమ చిన్ననాటి ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే ట్రెండ్‌ ఎక్కువైంది. భాషతో సంబంధం లేకుండా...

Viral Photo: ఈ ఫొటోలో ముద్దులొలికేలా ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడీమె ఓ బడా హీరోయిన్‌..

Edited By: Anil kumar poka

Updated on: Sep 16, 2021 | 11:32 AM

Viral Photo: నటీమణులు ఇటీవల తమ చిన్ననాటి ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునే ట్రెండ్‌ ఎక్కువైంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలకు చెందిన నటీమణులు తమ చైల్డ్‌ హుడ్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌ కూడా పెద్ద ఎత్తున తమ అభిమాన నటీనటుల ఫొటోలకు లైక్‌లు, షేర్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట ఓ హీరోయిన్‌ ఫొటో తెగ వైరల్‌గా మారింది.

ఆ నటీమణి ఎవరో కాదు కన్నడ సినిమా ద్వారా చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్న దీపికా పదుకొణె. బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ‘ఓం శాంతి ఓం’తోనే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును సొంతం చేసుకుందీ బ్యూటీ. ఇక అనంతరం వెనక్కి తిరిగి చూడని ఈ చిన్నది అనతి కాలంలోనే టాప్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్నారు.

ఇక బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణవీర్‌ సింగ్‌ను వివాహం చేసుకున్న ఈ చిన్నది ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీపికా ఇటీవల తన చిన్ననాటి ఫొటోలతో కూడి ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. దీంతో దీపికా చిన్నతనంలో ఎంతో క్యూట్‌గా ఉందంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి దీపికా చిన్ననాటి వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్..! రేపు ఈ సమయంలో బ్యాంకింగ్‌ సేవలు బంద్‌..

Minister Malla Reddy: తప్పకుండా వాడ్ని ఎన్‌కౌంటర్ చేసి పారేస్తాం.. మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన

Double Chin: డబుల్‌ చిన్‌ సమస్యతో బాధపడుతున్నారా.? అయితే ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అవ్వండి, ఫలితం పక్కాగా ఉంటుంది.