Viral Photo: చీర కట్టులో చూపు తిప్పుకోని అందంతో కట్టిపడేస్తున్న ఈ తార ఎవరో గుర్తు పట్టారా.? లేదా అయితే..

Viral Photo: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ తారలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఒకప్పుడు హీరో, హీరోయిన్ల ఫోటోలు చూడాలంటే న్యూస్‌ పేపర్‌ లేదా మ్యాగజైన్‌లను కొనుక్కొని..

Viral Photo: చీర కట్టులో చూపు తిప్పుకోని అందంతో కట్టిపడేస్తున్న ఈ తార ఎవరో గుర్తు పట్టారా.? లేదా అయితే..

Updated on: Oct 14, 2021 | 9:34 AM

Viral Photo: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ తారలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఒకప్పుడు హీరో, హీరోయిన్ల ఫోటోలు చూడాలంటే న్యూస్‌ పేపర్‌ లేదా మ్యాగజైన్‌లను కొనుక్కొని చూసేవారు. కానీ ఇప్పుడు సినీ తారలే తమ ఫోటోలను నేరుగా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. స్వయంగా తమ పేరుతో పేజీలను మెయింటెన్‌ చేస్తూ తమ వ్యక్తిగత వివరాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు తమ లేటెస్ట్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ వస్తున్నారు.

ఇక ఇలా వ్యక్తిగత ఫోటోలను అభిమానులతో పంచుకోవడంలో ముందు వరుసలో ఉండే నటీమణుల్లో అనుపమా పరమేశ్వరన్‌ ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉండే అనుపమా తన ఫోటోలను షేర్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ ఓ ఆసక్తికరమైన ఫోటోను షేర్‌ చేసింది. బ్లాక్‌ కలర్‌ చీరలో మొహం కనిపించీ, కనిపించనీ విధంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ..’ఈ ఫోటోలో ఉంది ఎవరో గుర్తించండి.?’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ఇక ఇందులో అనుపమ డిఫ్రెంట్‌ లుక్‌తో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా అనుపమను గమనిస్తే సన్నబడినట్లు కనిపిస్తోంది. ఇక ఈ ఫొటో చూసిన ఆమె అభిమానులు చక్కనమ్మ చిక్కినా అందమే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే అనుపమ సినీ కెరీర్‌ విషయానికొస్తే బెల్లం కొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన రక్షసుడు చిత్ర తర్వాత మళ్లీ తెలుగులో కనిపించని ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే స్పీడు పెంచింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగులో రౌడీ బాయ్స్‌, 18 పేజీస్‌, కార్తికేయ 2 సినిమాలతో పాటు తమిళంలో ఒక చిత్రంలో నటిస్తోంది. ఇలా మళ్లీ బిజీగా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందీ క్యూట్‌ గర్ల్‌.

Also Read: Potato Cheela Recipe: ఆలుతో అద్భుమైన బ్రేక్‌ఫాస్ట్.. పిజాను మించిపోయే రుచి.. ఇంకెందుకాలస్యం

Samantha: దసరా రోజు కీలక ప్రకటన చేయనున్న సమంత.. ఫ్యూచర్‌ ప్లాన్స్‌ గురించి చెప్పే అవకాశం..

Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..