Viral Photo: స్విట్జ‌ర్లాండ్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్‌ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.?

Viral Photo: స్విట్జ‌ర్లాండ్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్‌ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.?

Viral Photo: సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత గ‌డ‌ప దాటితే చాలు.. వెంట‌నే అప్‌లోడ్ చేసేస్తున్నారు. వీధి చివ‌ర ఉన్న గుడికి వెళ్లినా స‌రే వెంట‌నే ఓ ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సెల‌బ్రిటీలు కూడా అతిథులేం కాదు...

Narender Vaitla

|

Jan 25, 2022 | 1:23 PM

Viral Photo: సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత గ‌డ‌ప దాటితే చాలు.. వెంట‌నే అప్‌లోడ్ చేసేస్తున్నారు. వీధి చివ‌ర ఉన్న గుడికి వెళ్లినా స‌రే వెంట‌నే ఓ ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సెల‌బ్రిటీలు కూడా అతిథులేం కాదు. ఒక‌ప్పుడు త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను అభిమానుల‌తో పెద్ద‌గా పంచుకోని సెల‌బ్రిటీలు ఇప్పుడు ప్ర‌తీ చిన్న విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ అందాల తార త‌న హాలీడే ట్రిప్‌కు సంబంధించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పైన ఫోటోలో ఉన్న‌ హీరోయిన్‌ను మీరు ఈపాటికే గుర్తించే ఉంటారు. అవును… కెమెరాకు వెన‌కా నుంచి ఫోజుచ్చిన ఈ స్టార్ హీరోయిన్ స‌మంతానే. ప్రస్తుతం స్విట్జ‌ర్లాండ్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తున్న స‌మంత‌. తాను విడిదికి దిగిన హోటల్ బాల్క‌నీలో ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తున్న స‌మ‌యంలో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోతో పాటు దీనికి అల‌వాటు ప‌డాలి అనే ఆస‌క్తిక‌రమైన క్యాప్ష‌న్‌ను జోడించింది. దీనితో పాటు వైట్ క‌ల‌ర్ ఉన్న హార్ట్ ఎమోజీని యాడ్ చేసింది సామ్‌.

స‌మంత కెరీర్ విష‌యానికొస్తే నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత కెరీర్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతోంది స‌మంత‌. పుష్ప సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌తో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీని ఉలిక్కి ప‌డేలా చేసిన సామ్ తెలుగులో ఇప్ప‌టికే రెండు చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా బాలీవుడ్‌లోనూ ప‌లు అవ‌కాశాలు ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక ఇవే కాకుండా సామ్ హాలీవుడ్ చిత్రంలో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

Also Read: Anil Ambani Son Wedding: త్వరలో అంబానీ ఇంట మరో గ్రాండ్ వెడ్డింగ్.. నెట్టింట వైరలవుతోన్నఅనిల్ అంబానీ కుమారుడి ప్రి వెడ్డింగ్ ఫొటోస్..

Budget 2022: అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించాలి: లేబర్ నెట్ సహ వ్యవస్థాపకురాలు గాయత్రి వాసుదేవన్

James Webb Space Telescope: గమ్యస్థానం చేరిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.. విశ్వ రహస్యాల గుట్టు వీడేనా?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu