రామ్‌తో మూడోసారి అనుపమ..!

టాలీవుడ్‌లోని క్రేజీ జంటల్లో రామ్‌, అనుపమ జోడీ ఒకటి. ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాల్లో ఈ జోడీ కలిసి నటించారు.

రామ్‌తో మూడోసారి అనుపమ..!

Edited By:

Updated on: Nov 03, 2020 | 12:00 PM

Anupama Ram combination: టాలీవుడ్‌లోని క్రేజీ జంటల్లో రామ్‌, అనుపమ జోడీ ఒకటి. ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాల్లో ఈ జోడీ కలిసి నటించారు. ఇందులో ఉన్నది ఒక్కటే జిందగీ యావరేజ్‌గా నిలిచినప్పటికీ.. హలో గురు ప్రేమ కోసమే విజయవంతమైంది. సినిమాలను పక్కనపెడితే ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరు మూడోసారి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ( ‘కాఫీ విత్‌ సీఎం’.. గోవా ముఖ్యమంత్రి కొత్త ప్రోగ్రామ్‌)

త్రివిక్రమ్‌, రామ్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్లు ఇటీవల ఫిలింనగర్‌లో టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ కాంబోలో సినిమా కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఇక ఇందులో హీరోయిన్‌గా అనుపమ పేరు వినిపిస్తోంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ మూవీ ద్వారా అనుపమ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు రామ్ కోసం అనుపమను తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మూడోసారి ఆ జోడీని తెరపై చూడొచ్చు. కాగా త్రివిక్రమ్, రామ్ మూవీని స్రవంతి రవి కిశోర్ నిర్మించనున్నట్లు టాక్. ( నాగశౌర్య మూవీకి ఆసక్తికర టైటిల్‌)