Vijay Sethupathi: గోవాలో షూటింగ్ జరుపుకోనున్న విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ సినిమా..

|

Apr 29, 2021 | 11:40 AM

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అటు హీరోగా  సినిమాలు చేస్తూనే ఇటు విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన దళపతి విజయ్ మాస్టర్,  ఉప్పెన సినిమాల్లో సేతుపతి విలన్ గా నటించి ఆకట్టుకున్నారు.

Vijay Sethupathi: గోవాలో షూటింగ్ జరుపుకోనున్న విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ సినిమా..
Follow us on

Vijay Sethupathi: తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి అటు హీరోగా  సినిమాలు చేస్తూనే ఇటు విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవల విడుదలైన దళపతి విజయ్ మాస్టర్,  ఉప్పెన సినిమాల్లో సేతుపతి విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు  సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు తాకింది. ఆయనతో సినిమా చేయాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సేతుపతి నటిస్తున్నారు. మరో వైపు కత్రినా కైఫ్ నటిస్తున్న సినిమాలో కీలక  పాత్రలో కనిపించనున్నాడు సేతుపతి. కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా ‘మేరీ క్రిస్మస్’ సినిమా రూపొందుతోంది.

‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘గోవా’లో ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలని అనుకున్నారు. అయితే ఇటీవల కత్రినా కైఫ్ కరోనా భారిన పడటంతో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకొని వచ్చే నెలలో ‘గోవా’లో షూటింగు చేయనున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. కత్రినా .. విజయ్ సేతుపతి కాంబినేషన్లోని కొన్ని సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తారట. కరోనా నిబంధనలను అనుసరిస్తూ .. ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలనీ చిత్రయూనిట్ భావిస్తుంది. ఇక పాత్ర పరమైన ప్రయోగాలు చేయాలనుకునే దర్శకులు విజయ్ సేతుపతిని దృష్టిలో పెట్టుకునే, ఆ పాత్రలను డిజైన్ చేసుకుంటున్నారు. విజయ్ సేతుపతి నటనలో సహజత్వం కారణంగా, ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.  మరి ఈ విలక్షణ నటుడు బాలీవుడ్ లో ఎలా  రాణిస్తాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాట సినిమాలో ఆ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయట… ( వీడియో )

గ్లోబల్ స్టార్ ఐకాన్ పెద్దగా ఉపయోగపడలేదు.. ప్రియాంక చోప్రాపై చెల్లి మీరా చోప్రా సంచలన కామెంట్స్

Hero Prabhas Fans: ప్రభాస్‌ సినిమాలకు వ‌ర‌స‌ అడ్డంకులు.. ఫీలవుతున్న ఫ్యాన్స్..