96 Movie: బాలీవుడ్‎లోకి సేతుపతి మూవీ.. సూపర్ హిట్ 96 సినిమా రీమేక్..

|

Sep 23, 2021 | 4:21 PM

దక్షిణాదిలోనే కాకుండా.. నార్త్‏లోనూ ఇప్పుడు రీమేక్ చిత్రాల హవా నడుస్తోంది. చిన్న సినిమా అయిన..మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను రీమేక్

96 Movie: బాలీవుడ్‎లోకి సేతుపతి మూవీ.. సూపర్ హిట్ 96 సినిమా రీమేక్..
96 Movie
Follow us on

దక్షిణాదిలోనే కాకుండా.. నార్త్‏లోనూ ఇప్పుడు రీమేక్ చిత్రాల హవా నడుస్తోంది. చిన్న సినిమా అయిన..మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అలా తెలుగు, తమిళ్, హిందీ భాషలో ఇతర భాష సినిమాలు రీమేక్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. నారప్ప, మాస్ట్రో సినిమాలు రీమేక్ అయిన తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో క్లాసికల్ హిట్ మూవీ రీమేక్ కాబోతుంది. కానీ తెలుగులో మాత్రం కాదండోయ్. తమిళ్ సూపర్ హిట్ మూవీ 96 ఇప్పుడు బాలీవుడ్‏లో రీమేక్ కాబోతుంది.

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.. త్రిష జంటగా నటించిన 96 సినిమా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ క్లాసికల్ హిట్ మూవీని తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఇందులో సమంత.. శర్వానంద్ ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా తెలుగులో అంతగా హిట్ కాలేకపోయింది. తాజాగా ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్‏లో రీమేక్ కాబోతుంది. బాలీవుడ్ బడా నిర్మాత అజయ్ కపూర్ హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని అజయ్ కపూర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్వయంగా ప్రకటించారు. త్వరలోనే దర్శకుడు.. నటీనటుల గురించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లుగా తెలిపారు. మరి బాలీవుడ్‏లో ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Also Read: Suma Kanakala New Photos: యాంకర్ సుమ లేటెస్ట్ ఫోటోలు.. లంగా వోణిలో మెరిసిన ముద్దుగుమ్మ..

Maa Elections 2021: రసవత్తరంగా మా ఎలక్షన్స్.. మంచు విష్ణు ప్యానెల్ పై స్పందించిన నరేష్.. ఏమన్నారంటే..

Kondapolam: వైష్ణవ్ తేజ్ సినిమా రిలీజ్ డేట్ మారిందా ? కొండపొలం ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పడంటే..

Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్… నాని సినిమా డిజిటల్ రైట్స్ ఎవరు తీసుకున్నారంటే..