
సినిమాల్లో స్టార్‌డమ్ మాత్రమే కాదు.. వ్యాపారాల్లోనూ భారీ స్థాయిలో సంపదను కూడబెట్టిన సినీ ప్రముఖుల జాబితా మరోసారి ఆసక్తికరంగా మారింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026లో భారతీయ నటుల్లో అత్యధిక ఆస్తిపాస్తులు ఉన్న హీరోల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ మరోసారి టాప్ లో నిలిచారు. తాజా అంచనా ప్రకారం ఆయన సంపద సుమారు రూ.10,000 కోట్లు అని తెలుస్తుంది. అయితే అయితే ఈసారి షారుక్ ఖాన్ ఆస్తులు చాలా వరకు తగ్గిపోయాయి. 2025 హురున్ రిచ్ లిస్ట్‌లో షారుక్ ఖాన్, ఆయన కుటుంబ సంపదను రూ.12,490 కోట్లుగా అంచనా వేశారు. తాజా రూ.10,000 కోట్ల అంచనాతో పోలిస్తే ఒక్క ఏడాదిలో రూ.2,490 కోట్ల తేడా కనిపిస్తోంది. దాంతో షారుక్ ఏడాదిలో రూ.2,490 కోల్పోయారని బీ టౌన్ లో ప్రచారం జరుగుతుంది.
షారుక్ కేవలం సినిమా రెమ్యునరేషన్స్ మాత్రమే కాదు.. ఆయన కుటుంబంతో కలిసి నిర్వహిస్తున్న రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పేరుతో సినిమా నిర్మాణంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ కంటెంట్ వంటివి కూడా చేస్తున్నారు. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ లో షారుక్ కు పార్ట్నర్ షిప్ ఉన్న విషయం తెలిసిందే..షారుక్ ఖాన్ తర్వాత అమితాబ్ బచ్చన్ ఈ లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచారు. తాజా హురున్ 2026 అంచనా ప్రకారం ఆయన సంపద రూ.4,000 కోట్లు. 2025లో అమితాబ్ బచ్చన్ సంపదను రూ.1,630 కోట్లుగా అంచనా వేశారు.
ఇక బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా లిస్ట్ రూ.3,000 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. సల్మాన్ ఖాన్‌కు సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కూడా ఉన్నాయి. అలాగే నాలుగో స్థానంలో హృతిక్ రోషన్ రూ.2,500 కోట్లు. 2025లో ఆయన సంపదను రూ.2,160 కోట్లుఉంది. 2026లో అది రూ.2,500 కోట్లకు చేరింది. మొత్తంగా షారుక్ ఖాన్ – రూ.10,000 కోట్లు, అమితాబ్ బచ్చన్ – రూ.4,000 కోట్లు, సల్మాన్ ఖాన్ – రూ.3,000 కోట్లు, హృతిక్ రోషన్ – రూ.2,500 కోట్లు. ఈ నలుగురి సంపదను కలిపితే సుమారు రూ.19,500 కోట్లు అవుతుంది. ఇందులో షారుక్ ఖాన్ ఒక్కరే రూ.10,000 కోట్లు కావడం గమనార్హం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.