
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్, తాప్సీ పన్ను జంటగా నటించిన డంకీ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 21న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. పఠాన్, జవాన్‌ల తర్వాత షారుక్ నుంచి వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. విడుదలకు దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా డంకీ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. షారుక్ ఖాన్ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే సినిమా నిడివి 2 గంటల 41 నిమిషాలని తెలిసింది. U/A సర్టిఫికేట్ పొందడం సినిమాకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే 18 ఏళ్ల లోపు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో కలిసి కూడా ఈ చిత్రాన్ని చూడొచ్చు. కాబట్టి ‘డంకీ’ సినిమాని పిల్లలతో కలిసి వచ్చి చూడాలనుకునే ప్రేక్షకులకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తుంది.
‘డంకీ’ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయాలని సెన్సార్ సభ్యులు సూచించారు. ఆత్మహత్య చేసుకునే దృశ్యం ఉన్న చోట ‘ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు’ అని నోటీసు ఇవ్వాలని కోరారు. అలాగే సినిమా చివర్లో చూపించిన కొన్ని విషయాలకు ఆధారాలు కూడా అందించాలని సూచించారు. ఇన్ని సూచనలను పాటించి సినిమాకు ‘యు/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. రాజ్‌కుమార్ హిరానీ సినిమాలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన షారుక్‌తో మొదటి సారి సినిమా చేయడంతో డంకీపై ఆసక్తి పెరిగింది. బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ వంటి ఫేమస్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో నటించారు. ‘డంకీ’ కథ వలసలకు సంబంధించినదని ట్రైలర్‌లో హింట్ ఉంది. డంకీ విడుదలైన మరుసటి రోజే ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీ రన్ టైమ్ కూడా 2 గంటల 55 నిమిషాలని తెలుస్తోంది. మరి ఈ పోటీని తట్టుకుని
డంకీ సినిమా ఎంత మేర వసూళ్లు కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.
#Mumbai ke SRKians ka pura parivaar saath aya hai!❣️Entire theatre booked, records to be set, and a dhamaal FDFS planned– Dunki ka craze hai different 🔥#DunkiAdvanceBooking#DunkiFirstDayFirstShow#Dunki #DunkiFDFSpic.twitter.com/2kKJCZ4wHt
— DUNKI (@DUNKISRKIAN) December 17, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.