Salman Khan: అయ్యో పాపం.. సల్మాన్ ఖాన్ ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారా.. ? ప్రతిరోజూ ఓ పోరాటమే..

సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. 59 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకపోయినా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. తాజాగా తన ఆరోగ్య సమస్యలపై స్పందించారు.

Salman Khan: అయ్యో పాపం.. సల్మాన్ ఖాన్ ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారా.. ? ప్రతిరోజూ ఓ పోరాటమే..
Salman Khan

Updated on: Jun 23, 2025 | 7:58 AM

భారతీయ సినిమా పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఆయన వయసు 59 సంవత్సరాలు. ఇప్పటికీ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ గడిపేస్తున్నారు. కానీ ఈ హీరో పెళ్లి పై మాత్రం నిత్యం ఫిల్మ్ వర్గాల్లో ఏదోక చర్చ నడుస్తుంటుంది. స్టార్ హీరోయిన్లతో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపిన సల్లూ భాయ్..ఇప్పటికీ ఒంటరిగానే ఉండడంపై అనేక వార్తలు ప్రచారమవుతుంటాయి. తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సల్మాన్. వివాహం, విడాకులు భావోద్వేగపరంగా.. ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలని అన్నారు. వాటిని కొనసాగించడం అంత సులభం కాదని చెప్పారు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న సల్మాన్ తన లైఫ్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు.

అలాగే సల్మాన్ ఖాన్ ఏవీ మాల్ఫోర్మేషన్, బ్రెయిన్ ఎన్యోరిజమ్ అనే సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. “ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనమెంతో కష్టపడాల్సి ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు తరచూ గాయలు అవుతుంటాయి. ఇక ట్రైజెమినల్ న్యూరల్జియా అంటే (ముఖ భాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి), ఏవీ మాల్ఫోర్మేషన్ (రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితి), బ్రెయిన్ ఎన్యోరిజమ్ (మెదడులో వచ్చే చిన్నపాటి సమస్య) ఉన్నప్పటికీ నేను పనిచేస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు. వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాను. చిన్నతనం నుంచే ఇలాంటి సమస్యలు ఉంటే ఇప్పటికే వాటిని అధిగమించేవాడిని. కానీ ఇప్పుడు వీటిని అధిగమించేందుకు నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

సల్మాన్ ఖాన్ ఆరోగ్య సమస్యల గురించి తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. వెండితెరపై అద్భుతమైన నటనతో తమను అలరించే తమకు నచ్చిన నటుడు ఇన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. సల్మాన్ చివరిసారిగా సికందర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఏ.ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం విపరీతమైన వ్యూస్ అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Loading...
Unable to load recommendations.
Follow Us