Salman Khan : ఇది కదా అభిమానం అంటే.. క్యాన్సర్‏ను ఓడించిన చిన్నారి.. మాట నిలబెట్టుకున్న సల్మాన్ ఖాన్..

|

Jan 25, 2024 | 3:56 PM

4 ఏళ్ల వయసులో అతడికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మరోసారి కలిసి ధైర్యం చెప్పాడు. అసలు విషయానికి వస్తే.. మహారాష్ట్రలోని ముంబైలో నివసిస్తున్న జగన్బీర్ అనే 4 ఏళ్ల బాలుడు 2018 నుంచి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ లో జగన్బీర్ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆ సమయంలో అతడు సల్మాన్ ఖాన్ చూడాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా...

Salman Khan : ఇది కదా అభిమానం అంటే.. క్యాన్సర్‏ను ఓడించిన చిన్నారి.. మాట నిలబెట్టుకున్న సల్మాన్ ఖాన్..
Salman Khan
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే టైగర్ 3 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇందులో కత్రీనా కైఫ్ నటించింది. వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ సల్మాన్ సూపర్ హీరో. మంచితనం, సాయం చేయడంలో ముందుంటాడు. తన అభిమానులకు ఎన్నో రకాలుగా సాయమందిస్తుంటారు. అందుకే ఆయనను అంతా భాయ్ జాన్ అని పిలుస్తుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ 9 ఏళ్ల చిన్నారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు సల్మాన్. 4 ఏళ్ల వయసులో అతడికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మరోసారి కలిసి ధైర్యం చెప్పాడు. అసలు విషయానికి వస్తే.. మహారాష్ట్రలోని ముంబైలో నివసిస్తున్న జగన్బీర్ అనే 4 ఏళ్ల బాలుడు 2018 నుంచి బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ లో జగన్బీర్ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఆ సమయంలో అతడు సల్మాన్ ఖాన్ చూడాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా… ఇది చూసిన సల్మాన్ వెంటనే ఆ బాలుడిని కలుసుకున్నాడు.

జగన్‌కు 3 ఏళ్ల వయసులో మెదడులో కణితి రావడంతో కంటి చూపు దెబ్బతింది. ఆ తర్వాత ఢిల్లీ ముంబైలో వైద్యం చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. జగన్ పరిస్థితిని చూసిన ఆయన తండ్రి పుష్పిందరో ముంబైలో చికిత్స చేయించాలనుకున్నారు. ఆ సమయంలో ముంబై వెళ్తుండడంతో సల్మాన్ ఖాన్ ను చూడడం కోసమే తను ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని అన్నాడు జగన్. అతడు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సల్మాన్ నేరుగా అతడు వైధ్యం తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి ఆ చిన్నారితో మాట్లాడాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో ఆ చిన్నారికి ధైర్యం చెప్పి.. ధైర్యంగా చికిత్స తీసుకుని క్యాన్సర్‏ను జయించిన తర్వాత మళ్లీ కలుస్తానని మాట ఇచ్చాడు సల్మాన్.

ఇప్పుడు 9 ఏళ్ల జగన్.. క్యాన్సర్ మహామ్మారిని జయించాడు.. దాదాపు ఆరేళ్లపాటు 9 కీమో థెరపీలు చేయించుకున్నాడు జగన్. దీంతో అతడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సల్మాన్ ఖాన్. ముంబైలోని బాంద్రా రెసిడెన్సీకి జగన్ కుటుంబాన్ని పిలిచింది వారితో మాట్లాడారు. ఆ చిన్నారికి 96 శాతం కంటిచూపు తిరిగి వచ్చిందని.. రోజు అందరిలాగే స్కూల్ కు వెళ్తున్నాడని ఆ బాలుడి తల్లి సుక్బీర్ కౌర్ చెప్పారు. సల్మాన్ ఖాన్ చేసిన సాయం.. ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేనిదంటూ ఎమోషనల్ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.