రిచా చద్దా.. హిందీ సినిమాలు చూసేవారికి ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘మసాన్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ సిరీస్’, ‘ఫక్రీ’, ‘సరబ్‌జిత్’, ‘సెక్షన్ 375 ‘ వంటి సినిమాలతో హిందీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో హాట్ అండ్ డేరింగ్ బ్యూటీగా పేరున్న ఈ అందాల తార ‘షకీలా’ బయోపిక్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది. కాగా ఈ అమ్మడు ప్రస్తుతం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా క్రికెట్ గురించి మాట్లాడిన ఆమె భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ఆయన కోసమే మళ్లీ క్రికెట్ చూస్తాను..
‘నాకు చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా తమ్ముడు క్రికెట్ ఆడడానికి వెళ్తుంటే వాడితో పాటు నేను కూడా గ్రౌండ్‌కు వెళ్లేదాన్ని. ఇక టీనేజ్ లో నాకు రాహుల్ ద్రావిడ్ అంటే ఎంతో ఇష్టం. టీవీలో ఆయన కనిపిస్తున్నాడంటే చాలు.. అన్ని పనులు మానేసి మ్యాచ్ చూస్తూ కూర్చొనేదాన్ని. నా మొదటి క్రష్ కూడా రాహులే. నాకు ద్రవిడ్ ఎంతిష్టమంటే క్రికెట్ నుంచి ఆయన రిటైర్ అయ్యాక నేను కూడా క్రికెట్ చూడడం మానేశాను.. ఇప్పుడు మళ్లీ రాహుల్ టీమిండియా చీఫ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయన కోసం మళ్లీ నేను క్రికెట్ చూస్తాను. టీమిండియాను గెలిపించడానికి ఆయన ఎంతో కష్టపడతారు’ అని పేర్కొంది రిచా.
Also Read:
భయంకర బంతులు.. చేయి పగిలిపోయింది.. బ్యాట్ కింద పడింది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
IND vs NZ: టీమ్ ఇండియాని చిక్కుల్లో పడేసేందుకు ప్రయత్నిస్తున్న న్యూజిలాండ్.. ఎలాగంటే..?