Ranveer Singh: నయా శక్తిమాన్ గా రణ్‌వీర్ సింగ్‌.. ‘ఛీ ఛీ.. అతనా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖేష్ ఖన్నా

ఇండియన్ టెలివిజన్‌లో 'శక్తిమాన్' పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ముఖేష్ ఖన్నా ఇప్పుడు అదే కథ ఆధారంగా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో శక్తిమాన్ పాత్రలో ముఖేష్ నటించడం లేదు. అలాగే ఎవరు ఈ రోల్ లో నటిస్తారనేది ఇంకా వెల్లడి కాలేదు. ఇదిలా ఉంటే శక్తిమాన్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

Ranveer Singh: నయా శక్తిమాన్ గా రణ్‌వీర్ సింగ్‌.. 'ఛీ ఛీ.. అతనా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖేష్ ఖన్నా
Ranveer Singh, Mukesh Khanna
Follow us

|

Updated on: Mar 19, 2024 | 4:01 PM

ఇండియన్ టెలివిజన్‌లో ‘శక్తిమాన్’ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ముఖేష్ ఖన్నా ఇప్పుడు అదే కథ ఆధారంగా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో శక్తిమాన్ పాత్రలో ముఖేష్ నటించడం లేదు. అలాగే ఎవరు ఈ రోల్ లో నటిస్తారనేది ఇంకా వెల్లడి కాలేదు. ఇదిలా ఉంటే శక్తిమాన్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు అవాస్తవమని ముఖేష్ ఖన్నా స్పష్టం చేశారు. శక్తిమాన్ పాత్ర కోసం రణ్‌వీర్ సింగ్‌ను ఎంపిక చేయలేదని ముఖేష్ ఖన్నా క్లారిటీ ఇచ్చారు. ‘శక్తిమాన్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికీ నేను మౌనంగానే ఉన్నాను. అయితే ఈ సినిమాకు రణ్‌వీర్‌ సింగ్‌ సంతకం చేశారనే వార్తలను టీవీ ఛానళ్లు కూడా ప్రసారం చేయడం ప్రారంభించాయి. అందుకే నేను మాట్లాడవలసి వచ్చింది. రణవీర్ సింగ్ ఎంత పెద్ద స్టార్ అయినా సరే. కానీ అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి శక్తిమాన్ కాలేడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముఖేష్ ఖన్నా చెప్పుకొచ్చారు.

శక్తిమాన్ పాత్రలో రణవీర్ సింగ్ వద్దు అని ముఖేష్ ఖన్నా గట్టిగా చెప్పడానికి కూడా కారణం ఉంది. గతంలో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్ చేశాడు. ముఖేష్ ఖన్నా దీనిని బహిరంగంగానే ఖండించారు. ఇలా నగ్నంగా నటించడం భారత సంస్కృతి కాదంటూ మండిపడ్డారు. ‘వాళ్లు నగ్నంగా కనిపించడం ఓకే అయితే అలాంటి దేశానికి వెళ్లనివ్వండి’ అంటూ రణ్ వీర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు శక్తిమాన్. ఇప్పుడు రణ్ వీర్ సింగ్ నయా శక్తిమాన్ గా నటిస్తాడని వార్తలు వచ్చే సరికి ఇలా స్పందించాడు ముఖేష్. ‘శక్తిమాన్ కేవలం సూపర్ హీరో మాత్రమే కాదు. ఆయన సూపర్ టీచర్ కూడా. ఆ పాత్ర పోషించే నటుడిలో ఆ గుణం ఉండాలి. ఆయన మాట్లాడితే ప్రజలు వినాలి. రణవీర్.. నీకు నచ్చిన సినిమాలు నువ్వు చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే నిర్మాతలతో నేను మాట్లాడతాను. కొంతమంది పేరుకే స్టార్ హీరోలు.. కానీ ఇమేజ్ మాత్రం చాలా తక్కువ” అంటూ రణ్ వీర్ పై మండిపడ్డాడు ముఖేష్ ఖన్నా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

దీపికతో రణ్ వీర్ సింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.