Ileana D Cruz: ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఇలియానా.. భర్త గురించి ఏం చెప్పిందంటే..

కానీ అవేం పట్టించుకోకుండా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకున్న డైట్ గురించి పోస్టులు పెట్టింది. గతేడాది పండంటి బాబుకు జన్మనిచ్చిన ఇలియానా.. ప్రస్తుతం తన బాబు ఆలనా పాలన చూసుకుంటుంది. అయితే ఇలియానా పెళ్లి విషయంపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా ఎట్టకేలకు తన పెళ్లి గురించి రియాక్ట్ అయ్యింది.

Ileana D Cruz: ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఇలియానా.. భర్త గురించి ఏం చెప్పిందంటే..
Ileana
Follow us

|

Updated on: Apr 27, 2024 | 1:21 PM

దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి… తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించింది ఇలియానా. ఫస్ట్ మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి అటు తమిళం.. ఇటు హిందీ నుంచి ఆఫర్స్ ఎక్కువే వచ్చాయి. దీంతో ఈ అమ్మాడు అటు రెమ్యునరేషన్ సైతం పెంచేసింది. వరుసగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఖాతాలో డిజాస్టర్స్ వచ్చి చేరాయి. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కొన్నాళ్లపాటు అక్కడే సినిమాలు చేసిన ఈ భామ.. ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. చాలాకాలం సైలెంట్ ఉన్న ఇలియానా ప్రెగ్నెన్సీ పోస్టు అభిమానులకు షాకిచ్చింది. కానీ పెళ్లి చేసుకోకుండానే తల్లికావడం ఏంటనీ అనేక విమర్శలు ఎదుర్కొంది. కానీ అవేం పట్టించుకోకుండా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకున్న డైట్ గురించి పోస్టులు పెట్టింది. గతేడాది పండంటి బాబుకు జన్మనిచ్చిన ఇలియానా.. ప్రస్తుతం తన బాబు ఆలనా పాలన చూసుకుంటుంది. అయితే ఇలియానా పెళ్లి విషయంపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా ఎట్టకేలకు తన పెళ్లి గురించి రియాక్ట్ అయ్యింది.

ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ తన పెళ్లి గురించి కామెంట్స్ చేసింది. “ప్రస్తుతం నా వైవాహిక బంధం అందంగా సాగుతుంది. నా భర్తను నేను ఎంతగా ఇష్టపడుతున్నానో చెప్పడం చాలా కష్టం. నా కష్ట సమయాల్లో.. నా ఆనంద క్షణాల్లో ఎప్పుడూ నాకు తోడు ఉన్నాడు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి క్షణం నాకోసం నిలబడ్డాడు. అతడు ప్రేమ అంతులేనిది. ప్రతిరోజూ అతడు నాతోనే ఉంటాడు” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే గతంలో తన భర్త గురించి, కుటుంబం గురించి తప్పుగా మాట్లాడితే తట్టుకోలేనని తెలిపింది.

ఇలియానా గతంలో తన భర్త మైఖేల్ డోలన్ తో ఉన్న అస్పష్టమైన ఫోటోలను పంచుకుంటూ అతడిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చాలాకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఇలియానా.. ఇప్పుడు దో ఔర్ దో ప్యార్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో విద్యాబాలన్, ప్రతీక్ గాందీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు