Raju Srivastava: షాకింగ్.. జిమ్ చేస్తూ కుప్పకూలిన కమెడియన్.. గుండెపోటుతో ఆసుపత్రిలో..

ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో రాజు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి

Raju Srivastava: షాకింగ్.. జిమ్ చేస్తూ కుప్పకూలిన కమెడియన్.. గుండెపోటుతో ఆసుపత్రిలో..
Raju Srivastava

Updated on: Aug 10, 2022 | 3:34 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు.. కమెడియన్ రాజు శ్రీవాస్తవ (Raju Srivastava) గుండెపోటుకు గురయ్యారు. బుధవారం ఉదయం జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో రాజు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం జిమ్‏లోని ట్రెడ్ మిల్ పై పరిగెత్తుతున్న సమయంలో శ్రీవాస్తవ ఛాతిలో నొప్పితో కుప్పకూలినట్లు అతని అనుచరులు తెలిపారు.

దీంతో వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవాస్తవ పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు.. రెండు రోజులు పరిశీలనలో ఉండనున్నట్లు వైద్యులు తెలిపారు. అతని ఆరోగ్యంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు రాజు శ్రీవాస్తవ సుపరిచితుడు. దేశంలోని అత్యంత ఫేమస్ స్టాండ్ అప్ కమెడియన్లలో శ్రీవాస్తవ ఒకరు. సెలబ్రెటీలను, రాజకీయ నాయకులను ఇమెటేట్ చేయడంలో రాజు దిట్ట. మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టు గోవా, ఆమ్దాని అత్తన్ని ఖర్చు రూపయ్య వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. అలాగే హిందీ బిగ్ బాస్ సీజన్ 3లోనూ పాల్గొన్నాడు.