Sonakshi Sinha: రెండు నెలలకే.. పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తోన్న స్టార్ హీరోయిన్.. కారణమేంటంటే?

బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా వివాహం జరిగి సుమారు 2 నెలలైంది. మనసారా ప్రేమించిన జహీర్ ఇక్బాల్‌ని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపుతోందీ అందాల తార. అయితే ఈ మధ్య ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. సోనాక్షి ముంబైలోని తన ఇంటిని అమ్ముతోందట. ఆమె వివాహం ఈ ఇంట్లోనే జరిగింది. అయితే ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన ఈ ఇంటిని  హీరోయిన్ అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.

Sonakshi Sinha: రెండు నెలలకే.. పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తోన్న స్టార్ హీరోయిన్.. కారణమేంటంటే?
Actress Sonakshi Sinha
Follow us

|

Updated on: Aug 21, 2024 | 11:01 AM

బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా వివాహం జరిగి సుమారు 2 నెలలైంది. మనసారా ప్రేమించిన జహీర్ ఇక్బాల్‌ని పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపుతోందీ అందాల తార. అయితే ఈ మధ్య ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. సోనాక్షి ముంబైలోని తన ఇంటిని అమ్ముతోందట. ఆమె వివాహం ఈ ఇంట్లోనే జరిగింది. అయితే ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన ఈ ఇంటిని  హీరోయిన్ అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. పెళ్లి జరిగిన రెండు నెలలకే తన ఇంటిని అమ్మాల్సిన అవసరం సోనాక్షికి ఏమొచ్చింది? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ముంబైలోని బాంద్రాలో సోనాక్షి సిన్హాకు ఒక లగ్జరీ ఇల్లు ఉంది. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ ఫ్లాట్ చాలా విశాలంగా ఉంటుంది. సుమారు 4200 చదరపు అడుగుల ఈ ఇంట్లో విశాలమైన 2 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. అంతేకాదు జిమ్, ప్రైవేట్ లిఫ్ట్ మొదలైన సౌకర్యాలు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ఇంటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ఇంట్లోని ప్రతి గదిని చూపించారు. అయితే ఇందులో సోనాక్షి సిన్హా ఇల్లు అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఇది సోనాక్షి ఇల్లు అని కరాఖండిగా చెబుతున్నారు. దీనికి తోడు ఈ వీడియోను స్వయంగా సోనాక్షి సిన్హా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ చేసింది. ఇక ఈ లగ్జరీ ఇంటి ధర 25 కోట్ల రూపాయలు! ముంబై నగరంలో ఇంత ఎక్కువ ధరకు ఆస్తిని విక్రయించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న సోనాక్షి సిన్హా తన ఇంటిని ఎందుకు అమ్ముతోందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహం కూడా ఇదే ఇంట్లో జరిగింది. మరీ ఇంత సడెన్ గా ఎందుకు ఇంటిని విక్రయానికి పెట్టుందో సోనాక్షినే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

సోనాక్షి అమ్మకానికి పెట్టిన లగ్జరీ ఇల్లు ఇదే..

కాగా ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ ‘దబంగ్’ మూవీతో నటిగా సినిమా కెరీర్ మొదలుపెట్టింది. దక్షిణాదిలోనూ రజనీకాంత్ ‘లింగా’ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. గతంలో తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్‌తో చాన్నాళ్ల క్రితమే ప్రేమలో పడింది. ఈ ఏడాది జూన్‌లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Sonakshi Sinha (@aslisona) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శవాసనంతో ఎన్ని లాభాలో..​! ఈ ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ తెలిస్తే..
శవాసనంతో ఎన్ని లాభాలో..​! ఈ ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ తెలిస్తే..
గ్యాస్ సమస్యా.. ఇంట్లోనే ఈ చిట్కాలతో తగ్గించుకోండి..
గ్యాస్ సమస్యా.. ఇంట్లోనే ఈ చిట్కాలతో తగ్గించుకోండి..
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే.. మరో జన్మ ఎత్తాల్సిందే..
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే.. మరో జన్మ ఎత్తాల్సిందే..
ఓటీటీలో రచ్చ రంబోలా.. ఈ రొమాంటిక్ సినిమా చూస్తే పిచ్చెక్కల్సిందే.
ఓటీటీలో రచ్చ రంబోలా.. ఈ రొమాంటిక్ సినిమా చూస్తే పిచ్చెక్కల్సిందే.
ఏపీలో ఘోర ప్రమాదం.. రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం..
ఏపీలో ఘోర ప్రమాదం.. రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం..
ఎండిన చెట్టు కొమ్మ అనుకున్నారు.. తెరిచి చూడగా భారీ తేనె పట్టు..
ఎండిన చెట్టు కొమ్మ అనుకున్నారు.. తెరిచి చూడగా భారీ తేనె పట్టు..
నిన్న మొన్నటిదాకా ట్రేండింగ్ లో కియారా అద్వానీ పేరు! మరి ఇప్పుడు?
నిన్న మొన్నటిదాకా ట్రేండింగ్ లో కియారా అద్వానీ పేరు! మరి ఇప్పుడు?
జీహెచ్ఎంసీలో పర్యావరణహిత లక్ష మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ..
జీహెచ్ఎంసీలో పర్యావరణహిత లక్ష మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ..
తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనుకున్నాడు.. చివరకు..
తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనుకున్నాడు.. చివరకు..
పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఈ సమస్యల
పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఈ సమస్యల