నిమ్మరసం ఇలా తాగితే సమస్యలు ఆమడ దూరం..
TV9 Telugu
21 August 2024
పాదాలు మన శరీరంలో ముఖ్యమైన భాగం. మధుమేహం వల్ల పాదాల్లో నొప్పులు, వాపులు వంటి అనేక సమస్యలు రావచ్చు.
మీరు కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులైతే పాదాలపై కనిపించే చెడు లక్షణాలను విస్మరించకూడదు. ఆ లక్షణాలేంటో తెలుసుకోండి.
మధుమేహం పెరగడం వల్ల పాదాలలో నొప్పి లేదా వాపు వస్తుంది. మధుమేహం పాదాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే, రక్తం గడ్డకట్టడం కూడా జరగవచ్చు. మధుమేహం పాదాలలో తిమ్మిరి లేదా జలదరింపుకు కారణమవుతుంది.
మధుమేహం వల్ల కూడా పాదాల్లో మంటగా అనిపించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది.
రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల మీ పాదాలలో నొప్పి ఉంటే మీ పాదాలను గోరువెచ్చని ఉప్పు నీటిలో ముంచి కాసేపు ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
డయాబెటిస్‌లో పాదాలలో రక్త ప్రసరణ మరింత తీవ్రమవుతుంది. దీన్ని మెరుగుపరచడానికి రోజూ ఒకగంటపాటు నడక ద్వారా మధుమేహంతోపాటు బరువు కూడా అదుపులో ఉంటుంది.
మధుమేహం సమయంలో పాదాలలో కొన్ని అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయించుకోండి. దీని కోసం ఎప్పటికప్పుడు మధుమేహాన్ని తనిఖీ చేసుకోండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి