Shubman Gill: శుభ్‌ మన్ చాలా క్యూట్‌గా ఉంటాడు.. టీమిండియా క్రికెటర్‌పై మనసుపారేసుకున్న మరో స్టార్ హీరోయిన్

|

Jul 18, 2024 | 1:53 PM

టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌ మన్ గిల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్థులపై పరుగుల వర్షం కురిపించే ఈ డ్యాషింగ్ ప్లేయర్ ఆటతో పాటు రిలేషన్ షిప్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది

Shubman Gill: శుభ్‌ మన్ చాలా క్యూట్‌గా ఉంటాడు.. టీమిండియా క్రికెటర్‌పై మనసుపారేసుకున్న మరో స్టార్ హీరోయిన్
Ridhima Pandit, Shubman Gil
Follow us on

టీమిండియా యంగ్ క్రికెటర్ శుభ్‌ మన్ గిల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రత్యర్థులపై పరుగుల వర్షం కురిపించే ఈ డ్యాషింగ్ ప్లేయర్ ఆటతో పాటు రిలేషన్ షిప్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో సచిన్ కూతురు సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ సోషల్ మీడియాలో ఛాట్ చేసుకోవడం, ఒకరి పోస్టులకు ఒకరు లైక్ లు కొట్టడం, కామెంట్స్ చేయడంతో వీరి డేటింగ్ వార్తలు నిజమేననుకున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్ తో నూ శుభ్ మన్ ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని రూమర్లు వినిపించాయి. అయితే ఇప్పుడీ సారాలకు పోటీగా మరో హీరోయిన్ రేసులోకి వచ్చింది. అంతేకాదు శుభమన్ గిల్ తో డిసెంబర్ లో పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార రిద్దిమా పండిట్. గిల్, రిద్దిమాలు ప్రేమలో ఉన్నారని, డిసెంబర్ లో వీరి వావాహం జరగనుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. వీటిపై గిల్ స్పందించడం లేదు కానీ రిద్దిమా పండిట్ తాజాగా స్పందించింది. గిల్ తో తన పెళ్లి అంటూ వస్తోన్న వార్తలను కొట్టి పారేసిన ఆమె శుభ్ మన్ గిల్ మాత్రం చాలా క్యూట్ గా ఉంటాడటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి

‘శుభ్ మన్ గిల్ అద్భుతమైన స్పోర్ట్స్ పర్సన్ అని మాత్రమే తెలుసు. అంతే తప్ప అతనెవరో నాకు తెలియదు. మా మధ్య ఎలాంటి బంధం కూడా లేదు. ఒకవేళ అతడిని కలిస్తే మాత్రం ఈ రూమర్స్ గురించి చెప్పి మేం బాగా నవ్వుకుంటాం. శుభ్ మన్ గిల్ చాలా క్యూట్ ఉన్నాడు. కానీ ప్రేమ, పెళ్లి లాంటివేం లేవు’ అని రిద్ధిమా చెప్పుకొచ్చింది. మరోవైపు శుభ్‌మన్ మాత్రం ఈ పెళ్లి వార్తలపై ఇప్పటి వరకూ స్పందించలేదు. నిజానికి గతంలో సారా టెండూల్కర్ తో డేటింగ్ వార్తలపైనా గిల్ ఎప్పుడూ నోరు విప్పిన దాఖలాలు లేవు.
అయితే ఆ మధ్య గిల్ ను ఎక్కడ చూసినా.. సారా పేరుతో అభిమానులు అతన్ని ఆట పట్టించారు. ఈ డేటింగ్ రూమర్లు ఉండగానే ఇప్పుడు మరో ప్రేమ నటితో ప్రేమ, పెళ్లి పుకార్లు రావడం గమనార్హం.

రిద్దిమా పండిట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.