అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు గ్లామరస్ పాత్రలు పోషిస్తూనే మరోవైపు గుంజన్ సక్సేనా, రూహీ, గుడ్‌లక్ జెర్రీ లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తోంది. ఇటీవల మిలీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం (నవంబర్ 4) రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఒక్కో సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోన్న జాన్వీ ఏడాదికి సుమారు అరడజనుకు పైగా సినిమాలలో నటిస్తోంది. అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ చేజేతులా సంపాదిస్తోంది. ఈనేపథ్యంలో ముంబైలోని బాంద్రాలో ఓ విలాసవంతమైన డ్యూప్లెక్స్ విల్లాను కొనుగోలు చేసిందట ఈ స్టార్ కిడ్. ఇందుకోసం ఆమె ఏకంగా రూ.65 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. స్టాంప్ డ్యూటీ కింద మరో రూ.3.90 కోట్లు అదనంగా చెల్లించిందట. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఇటీవలే పూర్తయిందట.
కాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసేముందే జుహులోని తన ఇంటిని నటుడు రాజ్‌కుమార్ రావుకు రూ.45 కోట్లకు అమ్మేసిన సంగతి తెలిసిందే. దీనికి మరో 20 కోట్లు యాడ్ చేసి బాంద్రాలో తన కలల ఇంటిని సొంతం చేసుకుంది. 8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విశాలమైన విల్లాలో జాన్వీ రిలాక్స్ అయ్యేందుకు వీలుగా ఫస్ట్ ఫ్లోర్‌లో స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఏరియా కూడా ఉన్నాయట. కాగా నిన్న విడుదలైన మిలీ సినిమాలో జాన్వీ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. తండ్రి బోని కపూర్ నిర్మించిన ఈ చిత్రానికి మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. జాన్వీతో పాటు సన్నీ కౌశల్, మనోజ్ పాహ్వా, సీమ, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..